పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొప్పరపు కవి జంట

- ' మహాసహస్రావధాని '

డా॥ గరికిపాటి నరసింహారావు

అవధాన విద్య

మాడభూషి కవీంద్రుని మనసులో జన్మించి సహజ గంధములీను సరసవిద్య

తిరుపతి కవిజంట తిలుకమ్ము దిద్దగా ఏనుంగునెక్కు నవీన విద్య

కొప్రంపు కవిజంట కప్రంపుటాశువులు గుప్పించి ఎదిగిన గొప్పవిద్య

ఎనిమిదై వందయై ఎన్నెన్ని వేలుగా తీగసాగినపద్య తీర్ధవిద్య

తెలుగు పద్యము నింటింట త్రిప్పువిద్య

తెలుగు సంస్కృతి ఇన్నేళ్లు నిలుపు విద్య

ఎట్టి విశ్వ భాషలనైన లేని విద్య

ధ్యానయోగమ్ము మా అవధాన విద్య

గంటకు ఐదు వందలు ఎకాయెకి నాక
                           విమాన లోకపుం
ఘంటిక లూడిపోవునటు గంటలు గంటలు
                                 చెప్పిరంటు మీ
వంటి మహాశుసత్కవులు వందకు వేయికి
                                  ఒక్కరుంద్రు మీ
జంటను గూర్చి జెప్ప పదజాలము లేదు
                             మహాంధ్ర భాషలో