పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
102


చీరాల శతావధానము

పీఠిక

సత్యబంధులారా! రసికోత్తంసులారా!

జగత్ప్రసిద్ధులును శ్రీమద్భాలసరస్వత్యాశుకవిసింహాది బిరుదాంకితులు నైన బ్రహ్మశ్రీ కొప్పరపు సోదరకవి శిఖామణులు 15-10-1911 తేదీన మా చీరాల, పేరాల గ్రామవాసులయిన విద్యాభిమానులచే నాహూతులయి మా చీరాలకు దయచేసిరి. వారు ధూమయానము నెక్కివచ్చి మాయూరి రైల్ స్టేషనునందు దిగునప్పుడు మాయూరివారలును వారిని దర్శింపవచ్చిన యితర గ్రామ వాసులును గుంపులు గుంపులుగా వారినెదుర్కొని కరతాళధ్వనులచేతఁ దమయానందం బెఱిగించుచు దర్శనోత్సవంబు జరిపిరి. అట్టి సమయమున మాపురవాసులు ముందుగా నీ క్రింది విధముగా స్వాగత పద్యములను జదివి కవి చక్రవర్తుల యాశీర్వాదంబుంజెందిరి.

స్వాగత పద్యములు

శ్రీమదాశుకవిసింహబాలసరస్వతి కుండినకవిహంస కవిచక్రవర్తీత్యాది బిరుదాంకులగు బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకటసుబ్బరాయ, వేంకటరమణ కవీశ్వరుల సన్నిధికి -