పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిభూషణాది బిరుద విరాజితులయిన శ్రీ కొప్పరపు కవుల గొప్పదనాన్ని విశద పరిచే సద్గ్రంథం ఇది.

శ్రీ కొప్పరపు కవుల పద్యాలు హృద్యంగా హృదయాలలో సూటిగా నాటుకునేటట్లు ఉంటాయి. వీరి పదాల పొందిక మరే ఇతర సమకాలీన కవులకు లేదు.

“అనువుగ జొన్నయన్నమున యందున గల్పిన గోగుకూర తోఁ
దనకనుకూలమైన రుచి దార్కొనగా నొక పచ్చిమిర్పకా
యను గొఱుకంగఁ బూనుటహహా! తనుమించిన దానిఁ గూడుమన్
దనయునిముద్దు పెట్టుకొని తాపము వాసిన వాని చందమౌ"
                                           ('కొప్పరపు సోదర కవులు' : పుట - 108)

శ్రీ కొప్పరపు కవుల కవిత జొన్నన్నంలో గోంగూర కలుపుకుని పచ్చిమిరపకాయ కొరికినట్లు మనకు మహానందాన్ని కల్గిస్తుంది; తర్వాతే సేద్యః పరినిర్వృతి కలుగుతుంది.

"కొప్పరపు కవులు" గ్రంథాన్ని కూర్చి మనకు అందించిన సహృదయులు డా. గుండవరపు లక్ష్మీనారాయణ గారిని, ప్రస్తుతం 'కొప్పరపు సోదర కవుల కవిత్వం' లోకానికి అందిస్తున్న (శ్రీ కొప్పరపు వేంకట సుబ్బరాయ కవీంద్రుల దౌహిత్రులు) 'మా' శర్మగారిని ఈ సందర్భంగా బహుధా ప్రశంసిస్తున్నాను.

ఇట్లు