పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
70


శ్రీ శారదాంబాయైనమః

గుంటూరు శతావధానము

పీఠిక

శ్రీ బాలసరస్వత్యాశుకవిచక్రవర్త్యాద్యనేక బిరుదాంచితులగు బ్రహ్మశ్రీ కొప్పరపు సోదరకవు లాంధ్రదేశమున ననేక ముఖ్యస్థానములయందు నాశుకవిత్వ శతావధానాష్టావధానములు నిరాఘాటముగసల్పి తమకీర్తి యెల్లయెడల వ్యాపింపఁ జేసిరి. మా గుంటూరుపుర వాస్తవ్యులును గొలది కాలముక్రిందట వారి యాశుకవిత్వ ప్రౌఢిమనుగాంచి మెచ్చి వారికిఁ “గుండినకవిహంస” బిరుద మిచ్చిరి. ఇటీవల వారి శతావధాన ప్రాగల్భ్యమును సైతము వీక్షింపఁ గుతూహలము కలిగి యందునకొక సభఁగూర్ప నుద్దేశించుచుండ నింతలో విశదలలో శ్రీ చెరుకూరి