పుట:Kondaveeti Charitramu Maddulapalli Gurubrahmasarma 1907.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

శ్రీమత్కోదండరామాయనమః.

శ్రీకొండవీటిచరిత్రము.

ప్రధమాశ్వాసము.

     శ్రీపద్మాంశజయైన భూమితనయన్ జిన్ముద్రికాలక్ష్యసం
     ధాపాణిన్ శిరమందుజేర్చి విలస త్తత్వంబుబోధించుమే
     ధాపూతక్రియగొండవీటి విభుగా ధల్ దెల్పగాబూనుస
     ద్రూపున్ భక్తినుతించెదన్ శ్రుతుకుభృత్కోదండరామప్రభున్.

శివస్తుతి.



మ. స్తుతియింతున్ నిజపాదపద్మయుగళ స్తోత్ర ప్రసంగాభిసం
     గతహృత్పీఠ సుపర్వపారిషదము ఖ్యస్వీయభక్తాగ్ర్యస
     మ్మతయోగాఢ్యనగేంద్రజాహృదయ పద్మారామసీమార్యమున్
     సతతప్రాంచద భంగమౌళితలభా స్వత్సోమునిన్ సోమునిన్. 2

బ్రహ్మస్తుతి.



మ. నలుమోముల్ శ్రుతినాదసంకలిత విజ్ఞానస్వరూపంబులై
     పొలుపొప్పన్ సురరాజికాగమవిధుల్ బోధింపుచున్ బంకజా
     తలసత్పీఠి సరస్వతీయువతిజే తఃప్రీతితోగూడిని
     స్తులలోకాళిసృజించు పద్మజు నుతింతున్ భక్తినశ్రాంతమున్. 3

లక్ష్మీస్తుతి.



చ. కొలచెద జిల్క పల్కులను గుల్కుల బెళ్కులనాధుసెజ్జపై
    గలసిరహస్యవర్తనల గౌగిలినానుచు నొక్కసంశయం