పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రకటించుచుండెడివారు. సంస్కరణలవిషయమై పూర్వాచార పరాయణులగు పండితులకు, వీరేశలింగముపంతులుగారికిని రాజమహేంద్రవర మహాసభలలో వాదప్రతివాదములు పలుమారు జరుగుచుండెను. ప్రభుత్వోద్యోగులు చేయు అన్యాయములను వెలిబుచ్చటయందు పంతులుగారు మిక్కిలి శ్రద్ధయు పట్టుదలయు ప్రకటించుచుండిరి. రాజమహేంద్రవరములో ఒకడిస్ట్రిక్టుమునసబు లంచముపుచ్చుకొన్న కేసును పట్టియిచ్చుటకు వారు జరిపినచర్య పలువురు చాలకాలము ఆశ్చర్యముగ చెప్పుకొనుచుండిరి. ఆ మునసబు ఒకవ్యాజ్యములో పార్టీయొద్ద లంచముపుచ్చుకొని పక్షపాతము వహించి తీర్పు ఆపార్టీ కనుకూలముగ వ్రాసి ఆఫీసులో పెట్టెనట. ఆకేసులో ఎదిరిపక్షము ఆవ్యాజ్యములో మనసబు లంచముపుచ్చుకొని న్యాయవిరుద్ధముగ తీర్పువ్రాసినట్లు తెలిపినతోడనే పంతులుగారు జిల్లాజడ్జిగారి కీపక్షపాతమును విన్నవించిరి. జిల్లాజడ్జి మునసబుకోర్టుకు వచ్చునప్పటికి మునసబు తీర్పును తన ఆఫీసుపెట్టెలో పెట్టి తాళమువేసి కోర్టునుండి వెడలిపోయెను. ఆపెట్టెను కోర్టుజవాను మునసబుగారింటికి మామూలుప్రకారము తీసికొనివెళ్లుటకు సిద్ధముగా నుండెను. జిల్లాజడ్జి ఆపెట్టెకు తాళముపై సీళ్లువేసి మరునాడు దానిని తెప్పించి చూడవచ్చుననుకొని జవానుయొద్దనే యుంచి వెడలిపోయెను. జవాను మునసబుగారియింటికి పెట్టెను తీసికొనివెళ్లి జడ్జిగారు వేసినసీళ్లు చూపించెను. ఆపెట్టె కొయ్యదగుటచేత ఆరాత్రి దాని అడుగు చెక్కకు వేసినమరమేకులను మెల్లగ నూడదీసి, లోపల తాను వ్రాసిపెట్టిన తీర్పును చించిపారవైచి, రెండవపక్షమువారికే అనుకూలముగ తీర్పు మరియొకటి వ్రాసి ఆపెట్టెలో బెట్టి, ఊడదీసిన