పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గ్రుంకినపిమ్మట క్రొత్తగుంటూరులో నొక బాలింతకు నేదియో జాడ్యము ఉపద్రవముగ నున్నదని ఆమెబంధువులు డాక్టరుగారితో చెప్పుకొని, ఆమెను రోగియొద్దకు తీసుకొనివెళ్ళవలెనని వచ్చి, ఆమెతో మొరపెట్టుకొనుచుండిరి. నేను అప్పుడు అచ్చటనే యుండుటచేత వారిమాటలను ఇంగ్లీషులో డాక్టరుగారికి స్పష్టముగ తెలిపినవెంటనే ఆమె మిక్కిలి ఆతురతతో బయలుదేరి వారు తెచ్చిన బండిపై వెడలిపోయెను. ఆమెకు బాధనొందు దీనులపైగల దయార్ద్రహృదయమును గమనించి నేనును కొంతసేపటికి ఆ బాలింతయున్న ఇంటికి చేరితిని. బాలింత యున్నది చిన్న పెంకుటిల్లు, అది వీధి నానుకొనియున్నది. బాలింతయున్నగదియు ఆ వీధివైపుననే యున్నది. ఆ గదికి కిటికీలు లేవు. ఒక్కటే ద్వారము. ఆ గదిలో నొకకుంపటిలో కుమ్ము పెట్టినందున ఆకుమ్ము కాలినవాసన చుట్టును ఆవరించినది. పొగ గదియంతటను నిండినది. గాలి దూరనిచోటగుటచేత ఆగదిలోనికి బోవుటయే మిక్కిలి కష్టముగనుండెను. అయినను దేనిని లక్ష్యముచేయక డాక్టరుగారు గదిలో ప్రవేశించి, బాలింతను పరీక్షించినపిమ్మట గదిలోపలనుండి వెలుపలకు వచ్చుటతోడనే నేను రోగిస్థితి యెట్లున్నదని అడిగితిని. చాల ఉపద్రవస్థితిలో నున్నదనియును తా నచ్చటనే రోగియొద్ద కనిపెట్టుకొని యుండెదననియు చెప్పి, ఆమె ఇంటికి బోయి బట్లరుతో పాలుగాని మరియేదియైన ఆహారముగాని తీసుకొని తన కిమ్మని చెప్పవలసినదని నన్ను కోరెను. అప్పటికి రాత్రి ప్రొద్దు కొంత గడచినది. క్రొత్తగుంటూరు చిన్న బజారులో నున్న ఆరోగి యింటివద్దనుండి ఊరివెలుపల దూరమున ఆమె బంగళాకు