పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈమెట్రిక్యులేషనుపరీక్ష నిమిత్తము రాజమహేంద్రవరమునకు పోవుటయేగాక అంతకు రెండుసంవత్సరములముందు కొండుభొట్లసుబ్రహ్మణ్యశాస్త్రిగారు నన్నును, నాసహాధ్యాయుడు చెన్నూరిప్రకాశమును, అప్పటికి మిషనుపాఠశాలలో క్రింది క్లాసులోచదువుచుండిన కొలచిన అప్పయ్యదీక్షితు లనువిద్యార్థిని గూడతనవెంటబెట్టుకొని రాజమహేంద్రవరము తీసికొనివెళ్ళిరి. మధ్యదారిలో ఏలూరులో వారిబందుగులయింట నొకటిరెండు రోజులుండినపిమ్మట రాజమహేంద్రవరము తీసికొనిపోయిరి. శాస్త్రులవారు తమకుటుంబముతోగూడ బయలుదేరిరి. అప్పుడు గుంటూరునుండి బెజవాడకు బోవుటకు రెండెద్దులబండియే సాధనము. ప్రయాణీకులు ఉండవల్లిరేవునొద్ద చక్రాలబోటుమీద నెక్కి కృష్ణ దాటి బెజవాడ చేరుచుండిరి. మేమును ఆప్రకారమే ప్రయాణముచేసి, పడవమీద కృష్ణకాలువపైన ఏలూరువరకు బోయి, అక్కడ మరియొకపడవ నెక్కి రాజమహేంద్రవరమునకు పయనమైతిమి. కాని ఒకరాత్రివేళ మేము ఎక్కిన పడవకళాసులు మమ్ము మరియొకపడవలోనికి మా సామానులతోగూడ మారవలసినదని బలాత్కరించుటచే తప్పనిసరియై ఆ బోట్ల ఖామందులదే మరియొక పడవలోనికి సామానులు మార్చుచుంటిమి. అప్పయ్యదీక్షితులు ఒకకాలు మేము యెక్కియుండిన పడవపడిచెక్కమీద బెట్టి ఆ రెండవపడవ పడిచెక్కమీద రెండవపాదమును బెట్టి నిలువబడి ఒకపడవలోనుండి సామానులు రెండవపడవలోనికి అందించుచుండెను. ఇట్లు అందించుచుండగా ఆనుకొనియున్న రెండుపడవలు కొంచెము దూరమైపోవుటచేత రెండుపడవలమధ్య సందు ఎక్కువవెడల్పై