పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ సుబ్బారావుగారు Physics, Chemistry పాఠ్యపుస్తకములలోని విషయములను పాఠకులకు సుబోధకమగునట్లు పుస్తకములుగా ప్రకటించి, దేశ మంతట ఖ్యాతిగాంచియుండిరి. ఇంగ్లీషు వ్యాకరణము మొదలగువానికిసయితము Made Easy series సులభసంగ్రహరూపావళులను ప్రకటించుచుండిరి. ఇట్టి విద్యాగరిష్ఠులు మాకు హెడ్‌మాష్టరుగా వచ్చినందుకు విద్యార్థులగు బాలురము మిక్కిలి సంతోషించితిమి. నే నప్పుడు మెట్రిక్యులేషన్‌క్లాసులో బ్రవేశించితిని. కనుక మాకు ముఖ్యముగ సుబ్బారావుగారే పాఠములను చెప్పుచుండిరి. చెప్పునపుడు విషయములు సుకరముగ బోధపడుచుండెను.

వీరు ఇంచుక కోపస్వభావులగుటచేత తప్పులుచేసిన విద్యార్థులను బెత్తముతో కఠినముగ కొట్టుచుండిరి. వీరికాలమున బాలు రందరు ఎక్కువ భయము కలిగి మెలగుచుండిరి. పాఠశాలయెడల ప్రజలకు కొంత గౌరవము హెచ్చెను. కాని మిషన్ వారు వీరికి హెచ్చుజీత మిచ్చి భరింపజాల రనుట స్పష్టముగనే యుండెను. వీరు మనశక్తికి మించినవా రని ఊలుదొరగారే యనినట్లు చెప్పుకొనుచుండిరి.

శ్రీ సుబ్బారావుగారు హెడ్‌మాష్టరుగా మా పాఠశాలకు వచ్చిన మొదటిసంవత్సరముననే 1883 డిసెంబరులో నేనుమెట్రిక్యులేషన్ పరీక్షనిచ్చితిని. గుంటూరులో గవర్నమెంటు హైస్కూలు ఒకటి కొత్తగా వెలసినది. ఆ పాఠశాలకు శింగారవేలు మొదలియారుగారు హెడ్‌మాష్టరు. వీరు