పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మాతరగతిలోనూ చదువుచుండిరి. వీరు చక్కని రూపములకు దోడుగా విలువగల దుస్తులుధరించి, తాము గొప్పవారమను గర్వముతో వర్తించుచుండిరి. తెలివితేటలుగూడ వీరి కుండెను. వీరియందు మా హెడ్‌మాష్టరుగారికి అభిమానము. వారిని మెచ్చుకొనుచుండెడివారు. ప్రతిఆదివారమును ఈసోదరు లిర్వురును హెడ్‌మాష్టరుగారింటికి పోయి, వారితో సరససల్లాపములు గావించుచు వినోదముగ కాలముగడుపుచుండిరి. బడిలోగూడ హెడ్‌మాష్టరుగారు తమవాడైనట్లు, సంభాషణలవలనను, నడవడివలనను బయలుపరచుచుండిరి. ఇట్లుండ క్లాసుపరీక్షలు సమీపించినవి. రాబర్టు అను నా సహాధ్యాయి యొకడు బడిలోనుండి వెలుపలకు నన్ను బిలిచి, రహస్యముగ నిట్లనెను. " మన హెడ్‌మాష్టరుగారు మాచిరాజు సుబ్బారావుకు, ఆయన అనుకొన్న పరీక్షాప్రశ్నలు ముందుగనే చెప్పినాడట. ఇది మిక్కిలి అన్యాయముగదా! ఈసంగతి నీవు ఊలుదొరగారికి తెలుపవలెను. వారు విచారణచేసినయెడల నిజము బయటపడును" అని నన్ను బలవంతపరచెను. నేను అందుకు సమ్మతించి, ఊలుదొరగారితో "పరీక్షాప్రశ్నలు ముందుగనే హెడ్‌మాష్టరుగారు తమకభిమానపాత్రులైన సుబ్బారావునకు, ఆయన అన్నగారికి చెప్పినారని అనుకొనుచున్నారు. వారిరువురును ప్రతిఆదివారము హెడ్‌మాష్టరుగారి యింటికిబోయివినోదములతో కాలముపుచ్చుచుండురు" అనినేను మనవిజేసితిని. అంతట ఆయన కొన్నిరోజులు విచారణజేసి హెడ్‌మాష్టరు రివరెండుపాలుగారిని ఉద్యోగమునుండి బర్తరపు చేసిరి. ఇంత కఠినమైనశిక్ష విధింతురని మే మెవ్వరము అనుకొన