పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భుజకీర్తులుమొదలగు నలంకారములుచేయక వారివారి స్థితుల ననుసరించి సహజముగ ప్రజలు ధరించు దుస్తులను ధరింపజేసి వచనశైలిని సామాన్యముగ నొకరితోనొకరు మాట్లాడినట్లే నాటకప్రదర్శనము గావించుచుండిరి. ఇందులో శృంగారము, క్రోధము, శోకము మొదలగురసములు మిక్కిలి నిపుణముగ సహజముగ ప్రకటితమగుచుండెను. శోకమును పాడుచు, ప్రదర్శించుట సహజానుభవమునకు విరుద్ధముగ దోచకమానదు.కాబట్టి సహజమార్గమున శృంగారాదిరసములను ప్రదర్శించుట యను నూతనపద్ధతి పలువురకు ఆనందము గొల్పుచుండెను.

ఈ నాటకసంఘము ఆంధ్రదేశములో చాల స్థలములందు ప్రదర్శనములుగావించి ప్రఖ్యాతిగాంచెను. కావున వచనముననే కొన్ని నాటకములు వ్రాసి, సిద్ధముచేసి శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కొందరు విద్యార్థులను నాటకములందు ప్రీతిగలవారిని చేర్చి, సొమ్ముసంపాదింపవలెనను ఉద్దేశ్యముతోగాక, కేవలము ఆత్మానందమునిమిత్తము ప్రజలనానందింపజేయుటకు నుద్దేశించి గుంటూరు హిందూనాటక సమాజమను నొకసమాజమును స్థాపించిరి. శ్రీరామజననము, సీతాకళ్యాణము, ప్రహ్లాదనాటకము, హరిశ్చంద్రోపాఖ్యానము, మొదలగునాటకములు వేసవిసెలవులలో వరుసగ కొన్నిసంవత్సరములు ప్రదర్శింపజేయుచువచ్చిరి. వీరిరచనలు రసపూరితములై మిక్కిలి జనరంజకములుగనుండెను. కొందరు సమర్థులగునటులు నేర్పడిరి. తగినస్థలములో పాకవేయుట, తెరలుసిద్ధముచేయుట నాటకపాత్రలకు కావలసిన దుస్తులు అలంకారములు మొదలగుపనులు సర్కారు కచ్చేరీలలో