పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక పాత్రలుగ మార్చతలచినవారిలో నన్నుగూడ చేర్చి ప్రోత్సహించిరి.

అదివరకు దేశములో వీధినాటకములు సామాన్యముగ నాడుచుండిరి. చాలవరకు ఈ నాటకములలో దరువులుపాడుచు నృత్యముచేయుచుండుటచేత సంగీతము ప్రధానముగ నుండెను. ఈ నాటక బృందములలో చాలవరకు బ్రాహ్మణులే చేరియుండిరి. వీరిలో కొందరి నడవడి చెడ్డదిగ నుండెను. అందువలన భాగవతులు అంతగా గౌరవపాత్రులుగ నెంచబడకుండిరి. కాని కూచిపూడి భాగవతులనువారు ఈప్రాంతమున మిక్కిలి పేరు పొందిరి. వీరిలో భరతనాట్యము, అభినయ శాస్త్రములందు ప్రవీణులై పేరెక్కినవా రుండిరి.

నే నప్పటికి మిడిల్‌స్కూలుపరీక్షలో కృతార్ధుడనై యుండియుందును. అది ఇప్పటి ఫోర్తుఫారమువంటిది.


నాటకములు - వేషధారణ

ఆ దినములలోనే ధార్వాడనాటకసంఘము గుంటూరులో నాటకములను ప్రదర్శించి ప్రేక్షకుల నెక్కువగ నాకర్షించి గొప్పగా ధనము నార్జించెను. వీరు వీధులలో నాటకములు ఆడక పెద్ద పాకవేసి ఆపాకలో నాటకరంగమేర్పరచి దానిలో పలు రంగుల తెర లమర్చి అలంకరించి ఆకర్షణీయముగ జేసియు, నాటకపాత్రలకు వీధినాటకములలోవలె మోటుగా కిరీటములు,