పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మోయవలసివచ్చెను. కాని విసుగక, ఏమరుపాటులేక ఇంత భారమును వహించుటకు సంసిద్ధుడయ్యెను. ప్రతిదినమునను తెల్లవారుఝాముననే లేచి దాశరధీశతకములోని పద్యములు పాడుకొనుచు ఇల్లు శుభ్రముచేసి, పాత్రలుకడిగి తెల్లవారకమునుపే చెరువుకుబోయి స్నానముచేసి బావినీరు కావిడితో మోసుకొనివచ్చుచుండిరి. అప్పుడే వంటగూడ ప్రారంభముచేసి ఎనిమిదిగంటలలోపల తాను భోజనము ముగించుకొని బజారులో నౌకరీనిమిత్తము పోవుచుండిరి.

మాతల్లి చనిపోవునప్పటికి నేను పదేండ్లవాడను. నేనే ఆమెకు అంత్యక్రియలు జరిపియుంటిని. మా తండ్రిగారు నా ప్రక్కనుండి ఆపనులన్నియు నాచేత చేయించిరి. అప్పటి కింకను నేను తెలుగుబడిలోనే చదువుచుంటిని. నా పెదతమ్ముని అయిదవయేట ఊరబడిలో చదువవేసిరి. రెండవతమ్ముడు తొమ్మిది మాసముల పసిబాలుడగుటచేత మా అమ్మను కన్నతల్లి వానిని పెంచుచుండెను.


ఇంగ్లీషు చదువు

ఇక నాచదువువిషయమై కొంత సమస్య యేర్పడెను. ఇంగ్లీషువిద్య చెప్పించుటయా, లేక పార్షి చదివించుటయా? కొన్ని దినములు మఖ్‌తబ్ అనగా ఉర్దూపాఠశాలకు పంపిరిగాని కొలది దినములలోనే అచ్చటనుండి మార్చి ఇంగ్లీషుబడికి పంపించిరి. అదియొక ప్రైవేటుగ్రాంటుస్కూలు. గోవిందరాజు సూర్యనారాయణ