పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజించుచుండిరి. ఆపాటూరులోనే హరిహరనాథుని దేవాలయము కలదు. నాఉపన్యాసములో నెల్లూరువారి వ్యతిరేకవాదమును ఖండించుచు "ఇది ఎట్టి నీతియో తెలియకున్న" దని నేను వచించితిని. ఆవాక్యమునకు కోపించి శ్రీ సుబ్బుకృష్ణరావు మొదలగువారు సభను విడిచిపోయిరి. అంతట సభలో కలవరము సాగెను. నేనుమాత్ర మెవ్వరిని తూలనాడవలెనని ఆవాక్యము పలుకలేదు కాని నామూలముగ సభలో కలవరము కలుగుట వలన మనస్సు బాధించినది. పలువురు "ఎట్టినీతి" అన్నంత మాత్రమున తప్పులేదు అని వాదించసాగిరి. కాని మరి కొందరు మిత్రులు మాత్రము అది ఉద్దేశపూర్వకముగాకున్నను ఆక్షేపణీయమే యని అభిప్రాయపడుచుండిరి. సభ నిలుపుదల కావలసివచ్చెను. శ్రీ బయ్యా నరసింహేశ్వరశర్మగారు వచ్చి నే నెవ్వరిని అవమానించవలెనని చెప్పినదికా దని సభలో చెప్పినయెడల సభవిడిచిపోయినవారు మరల వచ్చెదరని చెప్పినందున నేను ఆప్రకారము చెప్పుటకు ఆక్షేపణలేదనియు ఆవచనములు పలికినపుడైనను నాకు వేరొక యుద్దేశము లేదనియు తెలిపితిని. ఈ మాటయైనను నేను జెప్పవలసిన పనిలేదని చాలమంది మిత్రులు ముఖ్యముగ యువకులగువారు విరోధించి పల్కిరి. సభ చక్కగా జరిగిపోయెను. ఆంధ్రరాష్ట్రతీర్మానమునుగూర్చి వాదప్రతివాదములు హెచ్చుగా నడిచెను. రాత్రి ప్రొద్దుపోవునప్పటికి సమ్మతులు తీసుకొనుట సంభవించెను. సభలో మొత్తముమీద లెక్కించగా అనుకూలాభిప్రాయములే హెచ్చుగా తేలినవి. కాని విడదీసి లెక్కించవలెనని సభ్యులలో కొందరు పట్టుబట్టిరి. ఆప్రకారము అనుకూలురను, ప్రతికూలురను విడదీయగా వ్యతి