పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పుడప్పుడు కొన్ని చిన్నఅప్పీళ్ళను ఆయనకే ఇచ్చి వాదన చేయించుచుంటిని. సమర్ధుడని గుర్తించగలిగితిని. నేను వృత్తిని వదలివేయుట ఆయనకును సమ్మతమైనది కాదు. "మీరు ఇంటిలో ఊరక కూర్చుండి సలహాచెప్పుచుండిన చాలును, నేనే స్వయముగ కోర్టుపని యంతయు చూచుకొనెదను. కావలెననిన మీయిష్టము వచ్చినప్పుడు దేశహితైకకార్యములు నెరవేర్చు కొనుచుండవచ్చును" అని నాకు సానుభూతితో సలహానిచ్చిరి. నానిశ్చయము తిరుగదని వారితోచెప్పి సమాధానపరచితిని. ఆయన జూనియరుగా నుండుటచే ఆయనకే యొప్పజెప్పినయెడల క్క్షిదారులు సమ్మతించరని సంశయముకలిగి, కొద్దిపాటి అప్పీళ్ళు మాత్రము స్వల్పముగ ఆయన కిచ్చి, తక్కిన అప్పీళ్ళను, అసలు వ్యాజ్యములను శ్రీపతి శ్రీనివాసరావుగారి కప్పజెప్పితిని. కొన్ని ముఖ్యమైన అసలువ్యాజ్యముల కక్షిదారులు తమవ్యాజ్యముల నెవ్వరి కిచ్చినను ఒప్పుకొనమనియు మీరే చేయవలసినదనియు గట్టిగా పట్టుపట్టినందున అట్టి రికార్డులు అయిదారు మాత్రము నాయొద్దనే యుంచుకొంటిని.

ఇట్లు నేను నాచేతనున్న వ్యవహారములు ఇతరులకు వదలివేయుచున్న విషయము విని, నాతో ఆంధ్రోద్యమప్రచారములోనూ, అంతకుముందునుండి కాంగ్రెసువిషయములలోను కలసిసంచరించుచుండిన శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రి వచ్చి "ఇది యంతయు సంసారమును వదలి సన్యాసాశ్రమముపుచ్చుకొను విరాగి చేయుకార్యముగనో లేక ప్రాణావసానకాలమున లోకమువిడచిపోవువాడు తన ఆస్తిపాస్తులు బందుగుల