పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వృత్తి విసర్జనం

అప్పటికి పదిసంవత్సరములపూర్వము నేనును శ్రీ చెన్నాప్రగడ భానుమూర్తిగారును కలసి పదిఏండ్లకు తదుపరి వృత్తిమానివేసుకొని ఏదో ఒక దేశహితైకకార్యమునందు ప్రవేశించవలెనని చేసికొన్న ప్రతిజ్ఞ నా కపుడపుడు జ్ఞాపకము వచ్చుచుండెను. ఉదయమున లేచి, ఆనాటి కేసులరికార్డును చదువుకొనుచుండగా ఇంటివెలుపల సూర్యకాంతులు ప్రకాశించుచు చల్లని గాలి వీచుచుండ వెలుపలకుబోయి తిరుగవలెనని కుతూహలము పుట్టినను ఇంటిలోకూర్చుండి పాఠములుచదివినట్లు కాగితములు చదువవలసివచ్చినప్పుడు ఈనిర్బంధమునుండి ఎప్పుడు విముక్తి చెందుదునా యనువాంఛ మనస్సున కలుగుచుండెను. అట్టివిరమణ సిద్ధించుటకు క్రొత్తకేసులు పుచ్చుకొనకుండవలెనుగదా. అదివరకు చేపట్టిన కేసులు త్వరలో ముగించుకొనవలెనుగదా యని యోచించుచుంటిని. కాని ఒకానొకరోజు ఏదియైన పెద్దఫీజు వచ్చెడికేసు వచ్చినప్పుడు దానిని వదల బుద్ది పుట్టెడిది కాదు. ఇట్లు ఆసంవత్సరములో తుదిమాసములు ముగియుచున్నకొలది మనస్సున ఆందోళన హెచ్చుచుండెను. వృత్తిపని యనిన కొంత విసుగుపుట్టుచుండెను. ఇట్లు సంచలనము చెందుచున్న మనస్సుతోడనే డిసెంబరుమాసము ముగియుసరికి పంజరమునుండి తప్పించుకొన్న చిలుకవలె నతంత్రవిహారతరుణమేర్పడెనని ఆనందోత్సాహములు హృదయమునం దంకురించి ఒకరీతి నూతనబలమును చేకూర్చెను. 1915 డిశంబరు 31 వ తేదినాడు వృత్తివిసర్జన చేయగలిగితిని. నామిత్రుడు చెన్నాప్రగడ భాను