పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/239

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దేవాలయమువెలుపల కట్టబడియున్న తొట్లలో నీరుత్రాగుటకు పులులుమొదలగు అడవిజంతువులు వచ్చునని అచ్చటివారు చెప్పిరి. చుట్టును రాతిగోడలతో కట్టిన ఎత్తగుప్రాకారము గలదు. ఆప్రాకారపుగోడ నానించి వరుసగా మండపములవలె అరలు కట్టబడి యాత్రికులు రాత్రులందు పరుండుటకు వీలుగ నుండెను. కొంద రాయరలలో వంటలుకూడ చేసుకొనుచుండిరి. ప్రాకారముఖద్వారము పెద్దదిగా నుండెను. ప్రాకారముమధ్య తూర్పువైపున చిన్నదేవాలయమును ముఖమండపమును గలవు. ఆదేవళముమధ్య నొకలింగము దాదాపు భూమిమట్టమున కట్టబడిన పానవట్టముతో నుండును. ఈలింగమును యాత్రికులందరును చేతులతో తాకి అభిషేకముచేసి స్వేచ్ఛగా పూజింతురు. ఈలింగముయొక్క శిఖరమున చిన్నతొఱ్ఱ యేర్పడియున్నది. అందు వ్రేళ్ళు పెట్టినయెడల నీ రున్నటుల తోచును. దాని దిగువభాగమున భూమిలోగుండ నీరుబారి దేవాలయ ముఖమండపు బునాదిగోడకు కట్టియున్న నందిముఖముగుండ నిరంతరము ప్రవహించి ఆముఖమండపమునకు ఆనించి దేవాలయమునకెదుట కోనేరువలె నుండు రాతితొట్టెలో ఏకధారగా పడుచుండును. ఇట్లు ప్రవహించుజలములు అతినిర్మలములై ఎప్పుడును సమశీతోష్ణముగ నుండును. అందు నడుములలోతు నీరు తరుగకయుండును. ఎంతమంది అందు స్నానముచేసినను నీరు శుభ్రముగనే యుండును. ఏలనన అందు పడుచున్న నీరు కుండులో నిలువక ఎప్పటికప్పుడు తూములగుండ వెలుపలకు ప్రవహించి కాలువగ పారుచుండును. వెలుపలితొట్టిని నింపు చుండును. స్నానముచేయువారి పాదములగోళ్లుసహితము తెల్లగ