పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/235

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తలంపుగా గొప్ప గాలివానవచ్చి వాటి నన్నిటిని నిర్మూలము గావించెను. బెజవాడ సన్మానసంఘమువారు వెనుదీయక మరల ఎంతయో సొమ్ము వ్యయముచేసి, అట్టివియే పాకలను నిర్మాణముచేసిరిగాని మరల నట్టి విపరీతవర్షమే కురిసి పాకల నన్నిటిని నేల గూలవేసెను.

బాపట్లలో మహాసభకు ఎనిమిదివందలప్రతినిధులు వచ్చియుండిరి. ఈసారి దేశములో రాష్ట్రనిర్మాణమునుగూర్చి తీవ్రమగు ఆందోళనజరిగియుండుటచే కొన్నివేలప్రతినిధులు రాగలరని బెజవాడవారు అందుకు తగినట్లు గొప్పఏర్పాటులు గావించిరి. బాపట్లలో రెండురోజులు సభ ముగిసిన మరునాడుదయమున ప్రతినిధులు వారివారి స్వస్థానములకు బోవుటకు రైలు స్టేషనుకు బోవునప్పటికి ఆకస్మికముగ పెద్దవర్షము కురియనారంభించెను. ఎంతతడవైనను వర్షము ఆగలేదు. రైళ్ళు రాలేదు. బాపట్ల సన్మానసంఘమువారు భోజనములులేక స్టేషనువద్దనున్నవారల కందరికి మరల వంటలుచేయించి భోజనములుపెట్టి ఆదరింపవలసివచ్చెను. ఈసారి వర్షము ప్రప్రధమముననే బెజవాడలో పాకలను పాడుచేసెను. ఇది తలచుకొని పలువురు విస్మయాకులచిత్తు లగుచుండిరి. మూడవసారి వేసిన పాకలుమాత్రము వర్షోపద్రవములేకుండ నిలచియుండెను. ఈమహాసభకు బందరు న్యాయవాదులలో ప్రముఖులైన శ్రీ పురాణము వెంకటప్పయ్యగారు సన్మానసంఘాధ్యక్షులుగానుండిరి. న్యాపతి సుబ్బారావుగారు సభాధ్యక్షులుగ నుండిరి. సభాదినమున ఉదయమే ప్రతినిధులు కృష్ణానదిలో స్నానములుచేసి ఊరిలోనూరే