పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యసంఘ సమావేశములలో చర్చించబడుచుండెను. 1911 లోనే న్యాపతి నారాయణరావు అనువారు భాషననుసరించి బేహారురాష్ట్రమువలెనే ఆంధ్రరాష్ట్రమునుగూడ నిర్మింపవలెనని వ్రాసినలేఖ పత్రికలలో ప్రకటించబడెను. యువకులలో జరుగుచున్న ఈఆందోళననుబట్టియే నిడదవోలుకాంగ్రెసుసభలో ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చిన తీర్మానము ప్రవేశపెట్టుటకు యత్నముజరిగెను. అప్పటినుండి పత్రికలలో ఆంధ్రరాష్ట్రమును గూర్చిన వాదప్రతివాదములు ప్రకటింపబడుచుండెను. కాని, ఆంధ్రోద్యమ మను పుస్తకమును వ్రాసిన నాకు ఆంధ్రరాష్ట్ర విషయమునుగూర్చి పత్రికలలో వ్రాయుట అభిమతముగాకుండెను. అదిగాకనేను ఆంధ్తోద్యమమునకు కార్యదర్శిగా వ్యవహరించుచుండుటచే ఆంధ్రరాష్ట్రనిర్మాణవిషయమున జోక్యముచేసుకొనుట ఉద్యమవ్యాప్తికి కొంతవిఘాతముగనుండును. ఈ కారణమునుబట్టియే జొన్నవిత్తుల గురునాధముగారును ఆసమస్యనుగూర్చి పత్రికలకువ్రాయలేదని తలంచుచున్నాను. కాని, ఆంధ్రులలో ఆంధ్రరాష్ట్రముపట్ల ఉత్సాహము పెరిగిపోవుచుండెను.

బాపట్లలో ఆంధ్రమహాసభకు చెన్నపురిశాసనసభలో పేరుపొందిన శ్రీ బయ్యా నరసింహేశ్వరశర్మగారు అధ్యక్షతవహించుట కంగీకరించిరి. నన్ను సన్మానసంఘాధ్యక్షునిగా నెన్నుకొనిరి. బాపట్లలో జిల్లాకాంగ్రెసుసభ పూర్తియైనమరునాడే ఆంధ్రమహాసభ సమావేశమయ్యెను. ఆంధ్రదేశమునందలి ప్రముఖులు అనేకులు సభకు విచ్చేసిరి. ప్రభుత్వోద్యోగులుకూడ వచ్చియుండిరి. వారిలో శ్రీ దివాన్‌బహద్దరు ముట్నూరు ఆదినారాయణయ్య