పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవిషయమైన భారమును వహింపవలసినదని కోరిరి. కాని నాకు వారిసంభాషణ ఆవేశపూరితమై అత్యాశలతో గూడినదిగా గన్పట్టెను. అంతటి మహత్కార్యము దుస్సాధ్యముగ గాన్పించెను. అందనిమ్రానిపంద్ల కఱ్ఱులుసాచినట్లే యని తలంచితిని. కాని వారితో బొత్తుగ నేకీభవించనని మాత్రము చెప్పజాలకపోతిని. అంతటి యుత్సాహముతో నున్నవారి మనస్సులను మరల్చుట సాధ్యముకాదని తోచెను. ఈయుద్యమము పలువురకు వెఱ్ఱి ప్రయత్నముగ తోచును. ఇప్పటి కది ఎట్లున్నను ఏనాటికైన సాధించదగినదని నాకు స్పష్టముగనే యుండెను. కావున వారితో నేనిట్లు పల్కితిని. "ఈయుద్యమము భగీరధప్రయత్నమువంటిది, వినినవారికి వెఱ్ఱిగా కాన్పించకమానదు. మనలో ప్రముఖులైన వారికి మిక్కిలి అయిష్టము కల్పించవచ్చును. అందరిని కూడ దీసుకొనిగాని ఉద్యమము బలముగసాగి ఫలింపజాలదు. ముందుగనే ఆంధ్రరాష్ట్రనిర్మాణమునకై ప్రయత్నించి పలువురను బెదరగొట్టక ఆంధ్రులు, దేహ బుద్ది, విద్యాపాటవమును ఆర్థికబలము నైతికబలము పెంపుజేసికొని, సర్వతోముఖమగు అభివృద్ధిపొందుటకు వలయుమార్గములను నిర్ణయించుటకు, ఆంధ్రులెల్లరు మేల్కొని ఐక్యముతో ప్రయత్నించుట అవసరముగాన ఆంధ్రమహాసభను స్థాపించి ఏటేట మహాసభలు ముఖ్యస్థానములలో జరుపుటయుక్తమని, అందులకువలయు ప్రచారము సాగించవలయు ననియు నాఅభిప్రాయము తెలిపితిని. వారిలో తీవ్రవాదులుకొందరు కొంతవడి భిన్నాభిప్రాయములు వెలిబుచ్చి వ్యతిరేకవాదన సాగించిరి. కాని తుదకు అందరమును నేను సూచించినమార్గమే యుక్తమని నిర్ణయించుకొంటిమి. అంతట