పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/224

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చుండిరి కావున ఈమూడు నొక్కటిగా నుండుట యుక్తమని వారి అభిప్రాయము. గుంటూరుజిల్లానుంచి వెళ్ళిన మేము కృష్ణాజిల్లాసంఘమునుండి విడిపోయి ప్రత్యేకగుంటూరుజిల్లా సంఘముగ నేర్పడవలెనని యుద్దేశించుకొనియుంటిమి. చివరకు మాయుద్దేశమే సభలోఅంగీకరించబడినది. ఆ కాంగ్రెసు సభలోనే ఆంధ్రరాష్ట్ర నిర్మాణమును గురించి తీర్మానము తెచ్చిరిగాని అధ్యక్షులుగానున్న శ్రీ వేమవరపు రామదాసుపంతులుగారు విషయనిర్ణయసభలో ప్రవేశపెట్టబడలేదుగనుక ఆతీర్మానము చర్చకుపెట్టుట సరికాదని నిరాకరించిరి.

మరునాడు గోదావరికాలువలో గుంటూరుమిత్రులు కొందరము స్నానముచేయుచుండగా యువకులలో నొకరగు చట్టి నరసింహారావుగారు "ఈసమయమున ఆంధ్రప్రముఖులందరు ఒక్కచో జేరుటచే పరస్పరపరిచయము లేర్పడెనుగదా! ఇటులనే ప్రతిసంవత్సరము ఆంధ్రజిల్లాలవా రందరు గూడి ఆంధ్రమహాసభ సల్పుట బాగుండు" నని పల్కెను. నేనును ఆవాక్యములు విని బాగుగనే యుండునని మారుపల్కితిని. అంతకంటె ఆవిషయమై ఎక్కువగా సంభాషణ ఏమియు జరుగలేదు.

కాంగ్రెసుసభలకు సామాన్యముగ హాజరుగాని ఆంధ్రప్రముఖులు ఆసభకు విచ్చేసిరి. ఆసభలో ఆంధ్రులను బర్మా యుద్ధమునాటినుండి సేనలో చేర్చుకొనగూడ దనునిషేధమును గర్హించుచు, దానిని తొలగించవలె నను తీర్మానము ప్రధానముగ చర్చించబడెను. అది ప్రభుత్వపుటుత్తరువును విమర్శించుట