పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నకు బోయి అచ్చట నున్నవారితో ముచ్చటించితిని. అపుడు గోక్లేగా రచట లేరు. కార్వేగారు విద్యార్థి భోజనశాలలో మాకొరకు విందుగావించిరి. పళ్ళెములలో భోజనముచేయుట వారికి ఆచారము. మనము పెండ్లిరోజులలో వియ్యాలవారి విస్తళ్ళచుట్టు మ్రుగ్గులువేసి ఊదుబత్తీలు వెలిగించినట్లు పళ్ళెములచుట్టును మ్రుగ్గులువేసి ఊదుబత్తీలు వెలిగించిరి. ఇట్టి మర్యాదలను వారిచేనంది వారు కట్టించిన మహిళాకళాశాలా భవనము, వితంతుశరణాలయము, భోజనవసతిగృహములు మొదలగు కట్టడములు దర్శించి, వాని కొఱకు లక్షలకొలది ద్రవ్యమును వసూలుచేసి విద్యాదానముచేసి స్త్రీల అభ్యున్నతి నిమిత్తము అనన్యమగు కృషిసల్పిన మహాత్యాగియగు కర్వేపండితుని సెలవు పుచ్చుకొని మరల గుంటూరు చేరితిమి.

పునహాపట్టణములో శ్రీమహాదేవగోవిందరేవడేగారి భార్య వారిగృహమునే విద్యాశాలగ మార్చి, వయస్సువచ్చిన గృహిణులకును వితంతువులకును సామాన్యవిద్యతో పాటు ఎంబ్రాయిడరీ, లేస్ మొదలగు చేతిపనులను నేర్పుచుండిరి. మేము ఆసంస్థను దర్శించినపుడు రేవడేగారిభార్య కందుకూరి వీరేశలింగముపంతులుగా రుండిన తెలుగుదేశమువారు మమ్ము శ్లాఘించుట ఎంతమాట" యని పంతులుగారిని ప్రశంసించెను. పిమ్మట శ్రీ పండితభండార్కరుగారి యింటికి బోయి వారినిగూడ సందర్శించితిమి. వారు మాతో ముచ్చటించుచు "మీప్రాంతము నుండి వేదపండితుడు లిచ్చటికి వచ్చుచుండెడివారు ఇప్పు డెవ్వరు నంతగ గానుపించుటలే" దని వక్కాణించిరి. వారిసంఖ్య తగ్గిపోవుచున్నదని మేము బదులు చెప్పితిమి. విద్యాధికులగు