పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జిల్లాకోర్టు సయితము బందరులోనె స్థాపించబడెను. 1904 సంవత్సరములో గుంటూరుజిల్లా ప్రత్యేకించబడువరకు జిల్లాకోర్టును, కలెక్టరు కచ్చేరియును బందరులోనే యుండెను.


బాల్యము

నల్లచెరువు నానుకొనియున్న రామచంద్ర పురాగ్రహారమును, ఎఱ్ఱచెరువు నానుకొనియున్న పాతగుంటూరు - ఈ రెండును దూరదూరముననున్న స్వతంత్ర గ్రామములేకాని యీ రెంటిమధ్యనున్న భాగమంతయు పిమ్మటి కాలములో క్రమముగ పెరుగుటచేత పైన జెప్పిన రెండు స్వతంత్ర గ్రామములు నొక్క పట్టణముగ రూపమెత్తినవి. కాని అన్నిటికిని పాత గుంటూరే ముఖ్యమగుటచేత పట్టణమున కంతకును గుంటూరు అను పేరే ప్రధానమైనది.

మా పాతగుంటూరులో వాసిరెడ్డివారికి దివానులుగా నున్న పొత్తూరివారు అను నొక ఆర్వేల నియోగి కుటుంబము గొప్ప పేరు ప్రతిష్ఠ పొందియుండెను. మాచిరాజువారు అను మరియొక ఆర్వేల నియోగివంశమువారు గొప్ప అగ్రహారీకులుగా నుండి గౌరవస్థానమున నుండిరి. తక్కిన బ్రాహ్మణ కుటుంబములలో దేశిరాజువారును అక్కెనప్రగడ వారును ముఖ్యులు. కాని మా కుటుంబమువారి పేరు కొండవారు. వీరి బంధువులు మట్టెగుంటవారు అను నాలుగు కుటుంబములవా రుండిరి. వీరందరు కూడ బీదలని చెప్పదగినవారే విదంబందు తక్కిన