పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


టుచేసుకొని, వారి కుటుంబముతాలూకు భూములు విక్రయము వ్రాయించుకొనుట సంభవించెను. దస్తావేజు మాఅన్నదమ్ములు ముగ్గురిపేరను రిజిష్టరుచేయించబడెను. ఇట్లు వ్యవహారము పూర్తియైనపిమ్మట ఆచార్యులవారిభార్యయు, ఆమెతండ్రియునువచ్చి, జీవనముజరుగుట దుర్లభముగ నున్నదని చెప్పి ఆమెకు మనువర్తి రావలసియున్నదని పేచీలుపెట్టసాగిరి. భర్త దుర్వ్యసనియై, ఆమె జీవనమునకు తండ్రిగారి యిల్లు చేరవలసిన దుస్థితి కలుగుట గుర్తించి ఆమెకును కొంత సొమ్మిచ్చి, సమాధానపరచి పంపితిని. అప్పటి ధరలనుబట్టి ఇది దండుగవ్యవహారముగనే కనుబడెనుగాని అల్లరిపాలుగాకుండ వచ్చినంతవరకే చాలునని సంతుష్టిచెంద కల్గితిమి. ధూళిపూడిఆసామీకి ఇవ్వవలసిన తాకట్టుబాకీ క్రమేణ మేమే చెల్లించితిమి. ఈ పరిష్కారము 1908లో మేము పంపిణీలు చేసుకొని పారీఖత్తు రిజిష్టరుచేసుకొన్నపిమ్మటనే జరిగెను. కనుక ఈభూమియు జాయింటుగనే యుండి అయివేజుమాత్రము మూడుభాగములుగా పంచుకొనుచుంటిమి.

ఈ 1908 లోనే నేను మాతండ్రిగారితోడను నాసంసారముతోగూడ కాశీయాత్రకు వెళ్ళి, కాశీ గయా ప్రయాగ జగన్నాధాది తీర్థస్థానములనుదర్శించివచ్చితిని. మాతండ్రిగారి కప్పటికి డెబ్బదిఎనిమిది సంవత్సరములున్నను ఆ తీర్థయాత్రలయందలి భక్తిచే ఆయాస మనుకొనక నదులలో స్నానములుచేయుచు ఎంతదూరమైనను కాలినడకనే పోవుచు శ్రద్ధతో దేవసందర్శనములుచేయుచు మిక్కిలియోపికతో తిరిగిరి. 1909లో రామేశ్వరమునకు బోతిమి. శ్రీరంగము ముక్కోటిఏకాదశినాటికి చేరితిమి. రేపకడనే చేచి స్నానములుచేసి రంగనాధదేవాలయమునకు