పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనస్థలములో డాబాయిల్లు కట్టుకొనెను. అది కట్టుకొనుచుకూలీలకు సొమ్ముచెల్లించవలసినపుడు నాయొద్దకు వచ్చి, ఆసొమ్ము నిమ్మనికోరుచుండెను. నే నప్పుడు విరివిగ సంపాదించుకొనుచుంటిని గాన అడ్డుచెప్పక ఇచ్చుచువచ్చితిని. ఆప్రకారము సుమారు వేయిరూపాయలవరకు తేలెను. నే నది మరల పుచ్చుకొనవలె నను అభిప్రాయముతో నియలేదు. భూముల విచారణ నేనే జరుపవలసివచ్చెను.

అయిలవరములో మాతండ్రిగారు ఆయూరి ఆచార్యుల వారికి పెట్టిన రుణముక్రింద మాకు కొంతభూమి సంక్రమించెను. ఆ ఆచార్యులు దుర్వ్యసని. మానాయనగారు వారి వర్తనము విచారింపక వడ్డీకి ఆశపడి సుమారు రు 6000/- ల వరకు రుణముపెట్టిరి. అంత మొత్తమునకు ప్రామిసరీనోట్లుమాత్రమే వ్రాయబడియుండెను. ఇది యంతయు నేను బందరులో నున్నకాలమున నడిచినది. మాతండ్రిగారికి ఈబాకీ రాబట్టుట కష్టసాధ్యముగ తోచి నేను గుంటూరు వచ్చినపిమ్మట నాకు తెలుపుటచే నేను ఆచార్యులగారి గ్రామమునకు వెళ్ళి విచారించగా ఆయన మాతండ్రిగారిచే బాకీ పెట్టించిన ఒక ఆసామీకి స్వాధీనుడై వర్తించుచున్నాడని తెలిసినది. ఆయనతాలూకు భూమి ధూళిపూడిలో నొకవర్తకునకు తాకట్టుపెట్టినట్లుగూడ తెలియ వచ్చినది. ఆచార్యులుగారు ముఖముతప్పించుచు కనపడకుండెను. ఆయనతల్లిగారిని పిలిపించి ఆమెతో చెప్పియు, స్నేహితుడైన ఆసామీసహాయముతో ఆచార్యులవారిని రప్పించియు, మరి కొంత సొమ్ము తల్లిగారికిని ఆచార్యులగారికిని ఇచ్చునట్లు ఏర్పా