పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాయిదావేయించెదనుగాన తొందరపడనవసరము లేదని సమాధానముచెప్పినట్లు తెలిపెను. ఎంతయో శ్రమమీద మావ్యవహార మంతయు శ్రీ సుబ్రహ్మణ్యము శ్రీ బోడాముగార్ల ఎదుట విచారణకువచ్చునట్లు ఏర్పాటుచేసుకొంటిమి. మరల వాయిదాపడునెడల మరి ఎవ్వరియొద్దకు పోవునో, అని ఎంచి ఏమైననుసరే మారికార్డు మా కిచ్చివేయవలసినదని కోరితిమి. గుమస్తా రికార్డు తెచ్చియిచ్చెను. సూర్యుడు అస్తమించు సమయ మాసన్నమయ్యెను. రికార్డు చేతబట్టుకొని ఏమిచేయుటకు తోచక చింతించుచు మైలాపూర్ లజ్‌చర్చిరోడ్డుమీద న్యాయవాది శ్రీ కృష్ణస్వామి అయ్యరుగారి బంగళాకేగితిమి. వారు మిక్కిలి మర్యాదగా మా వర్తమానమంతయు వినిరి. మేము నాగేశ్వరరావుగారి కిచ్చిన అర్జీలోని వాక్యములను చదివి, కృష్ణస్వామయ్యరు మాపై చాల కుపితుడై మీ రిట్లు వ్రాయుట ఎంతమాత్రము సరికాదని పలికెను; కాబట్టియే మేము మీవద్దకు రావలసివచ్చినదని నేను జవాబుచెప్పినమీదట రికార్డుతీసుకొని మమ్ము భోజనముచేసుకొని రండని పంపెను. మేము భోజనముచేసి వచ్చునప్పటికే ఇంటివాకిట తోటలో దీపమునెదుట రికార్డు చదువనారంభించెను. రికార్డు చదువునపుడు మధ్యమధ్య పండ్లుకొరికి "ఎందు కింత మూర్ఖముగా ఈ దూషణవాక్యములు వ్రాసితి"రని మాత్ర మనుచుండెను. రికార్డంతయు చదివి, రేపు ఉదయము మరల చదివెదననెను. మరునా డుదయమున మాతోగూడ భట్రాజు వెంకట్రాయుడుగా రుండిరి. ఆసామీమీద చోరీకేసురికార్డు మొదలగు వ్యవహార మంతయు ఆయన అయ్యరుగారికి సావ