పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నాగేశ్వరరావుగారు క్రిందికోర్టుతీర్పు ఖాయముచేసిరి. ఆతీర్పు మీదగూడ రివిజన్‌పిటిషను హైకోర్టులో దాఖలుచేయబడెను. మరియు జిల్లాజడ్జిగారికి నాగేశ్వరరావుగారు తగు చర్యనిమిత్తము లేఖ పంపిరని పైన వ్రాసితిని. జడ్జిగారు దానిని తనపై బెట్టుకొనక మాలో సూర్యనారాయణరావు హైకోర్టులోవకీలుగాన మా యిర్వురవిషయముగూడ విచారణకు హైకోర్టునకే పంపివేసెను. అనగా న్యాయవాదులచట్టముక్రింద విచారణనిమిత్తము పంపబడినదనుట. కాబట్టి అవనిగడ్డమాజిస్ట్రేటు వేసినఆర్డరులు తీర్పులు, మేము వ్రాసిదాఖలుచేసిన అర్జీయును నాగేశ్వరరావుగారు వేసిన ఆర్డర్లు తీర్పును, బందరుప్లీడరు ఇచ్చిన అఫిడవిట్లును, మాతరపున సామ్యుయల్‌గారు దాఖలుచేసిన అర్జీయును ఈ కాగితములన్నియు మొత్తమున ఒక్క వ్యవహారముతో సంబంధించిన రికార్డుగా నేర్పడినవి. జిల్లాజడ్జి హైకోర్టుకుపంపిన కాగితములుగూడ వీనికి దోడయినవి.

ఈ వ్యవహార మంతయు ఒక్కసారిగ కోర్టు ఎదుట విచారణకు వచ్చునట్లు హైకోర్టులో ఏర్పాటుచేయుటకు స్వామినాధను చాల శ్రమచేసి అధికారులను ఆశ్రయించి, శ్రీ సుబ్రహ్మణ్యము, బోడాముగార్ల కోర్టులోనే ఒక్కవాయిదాకే విచారణకు వచ్చులాగున ఏర్పాట్లు గావించెను. శ్రీ సుబ్రహ్మణ్యముగారు న్యాయమూర్తిగా నుండుట మాకు అనుకూలమని తలచితిమి. కాని ఇంతలో శంకరునాయరుగారు హైకోర్టుజడ్జిగా నియమింపబడుటచే మేము మరియొక న్యాయవాది నేర్పరచుకొనవలసివచ్చెను. మావ్యవహారము విచారణకు వాయిదా