పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కను పరికించి సాక్షులు ప్రమాణముచేసి సాక్ష్యమీయలేదు గనుక అది విచారణలో గొప్ప లోపమని తెలిపిరి. అంతట కలెక్టరు నాగేశ్వరరావుగారినే సాక్షులను క్రమముగా విచారించి నవేదిక పంపవలసినదని ఆర్డరువేసెను. ఇంతలోనే అవనిగడ్డ మాజిస్ట్రేటు నాగేశ్వరరావుగారిని దర్శించి, వారి అభిమానమును సంపాదించుకొనగల్గెనని ప్రజలు బాహాటముగ చెప్పుకొనసాగిరి.

నాగేశ్వరరావుగారు మాజస్ట్రేటుమీద మహజరులు పెట్టినవారిని వారి సాక్షులను విచారణచేయుటకు వాయిదావేసి నోటీసులు పంపిరి. వానిని పుచ్చుకొనక తప్పించుకొని తిరుగుచు మహజరులుపెట్టినవారు, సాక్షులు వాయిదాలకు హాజరుగాక పోవుట సంభవించినది. నాగేశ్వరరావుగారియొద్ద హాజరైన యెడల మహజరులోని అంశములు అబద్ధములని తీరుమానించి తమపై నేరారోపణ చేయుదు రనుభయము కలిగి వారట్లు తప్పించుకొనుచుండిరి.

ఇట్లుండగా చల్లపల్లి జమీందారుగారికి వారిసోదరులకును గలిగిన విరోధములనుబట్టి వారి రహితులలో కక్షలు ప్రబలి నొకరిపై నొకరు దౌర్జన్యములుజరుపుకొనినట్లు పెద్దకేసులు మాజస్ట్రేటుకోర్టులో దాఖలైనందున ఆవిచారణ నాగేశ్వరరావుగారే జరుపుట సంభవించినది. జమీందార్లమధ్య విరోధమును బట్టి ఏర్పడిన కేసు గనుక బందరులోని పెద్దవకీళ్ళందరును ఏదో ఒకపక్షమున పనిచేయుటకు వాయిదానాడు కోర్టులో హాజరైరి. ఇతరు లనేకులుగూడ వింతజూచుటకు వచ్చి కోర్టు నిండియుండిరి. విచారణజరుగుచుండగా అవనిగడ్డమాజస్ట్రేటుగారికి నూరు