పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జీవితములో సుఖదు:ఖము లను నవి వ్యక్తికి మాత్రమే సంబంధించినవి. పరుల కుపకరించినదే నార్ధక జీవినమని యెంతును. ఈ నిర్ణయము లోకులు చేయవలసినదే. కాని ప్రతి వ్యక్తియు తన జీవితము పరుల కుపయోగించునో, లేదో నిర్ణయించుట కధికారి కాకపోయినను తన శక్తికొలది నుపయుక్తముగనే జీవితము నడపగలిగితినని ఆత్మతృప్తి చెందుటకు మాత్రము అవకాశము కలదు. కావున నా జీవితము కేవలవ్యర్ధముకాదను ఆత్మసంతుష్టి పరమేశ్వరుడు నాకు ప్రసాదించెనని మాత్రము చెప్పగలను.

కావున యీ సృష్టియందు నాకు జన్మయొసంగి కర్మఫలముల ననుభవించుటకు దీర్ఘ జీవితము ననుగ్రహించిన పరమేశ్వరునకు ప్రణమిల్లి, లోకమున రూపమెత్తుటకు కారణభూతులైన తలిదండ్రులకు నమస్కరించి, పెంచి పెద్దవానిగ జేసి విద్యా బుద్ధులు గరిపించిన నా తండ్రిగారిని, విద్యాగురువులను గూడ కృతజ్ఞతాపూర్వకముగ ప్రస్తుతించి, నా పరమ మిత్రులను సంస్మరించి, యీ నా జీవయాత్రా ప్రకరణ వ్రాయుచున్నాను.

మరియు-

        తనువులు రెండు జన్మలకు తారకమార్గము చూడనొక్కటే
        యనుచును నీతిధర్మముల నారసి యెప్పుడు దైవభక్తితో
        జనుపగబూన కాపురము చల్లగ సాగెను ప్రేమసింధువం
        దనువమలీల గ్రుంకులిడ నాదర మొప్పగమానె దు:ఖముల్.

        ఇటులనె నేబదేండ్లు భువి నిచ్చలు సౌఖ్యముగొల్పు భార్య న
        న్నిట విడనాడి స్వర్గమున కేగెను బిడ్డలనెట్లు బాపెనో
        పటుతరశీం సంపదల భద్రతగాంచిన భాగ్యశాలి పే
        రట కృతనిత్తు పుణ్యముల రాశికి వెంతట సుబ్బమాంబకున్.


____________