పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనన్యమగు శిల్పవిద్యాకౌశల్యమును ప్రకటించు చలువతాతి యలవ యొకటి కోణములుదీర్చి, మణిమయపుష్పలతాలృకంతమై, యొప్పారుచున్నది.

మహాప్రసిద్ధమగు ఈ నిర్మాణమువెనుక దాని నానుకొనియే యమునానది ప్రవహించుచున్నది. వెన్నెల రాత్రులందు చంద్రికాప్రవాహమున తేలియాడు ఈ చంద్రశిలాభవనసౌందర్యము కన్నులార జూచియానందించవలసనదేగాని వర్ణింప దరముగాదు. మరియొకమారు దీరికచేసుకొని రాత్రివేళ అట్టి తరుణమున ఆసుందరభవనమును దర్శించితిని. అమందానందము నొందితిని.

డిల్లీ నుండి నాకంటె ఒకపూట ముందు బయలుదేరి ఆగ్రాలో నన్ను కలిసికొందు ననిచెప్పిన మిత్రుడు తిరునారాయణస్వామి కనుబడకపోయినందున,నతనియొద్ద దమ్మిడీయైన లేకుండ నేను తీసికొనియుండుటచే అత డెక్కడ నెంత నిస్సహాయుడుగ నుండెనో, ఏమైపోయెనో యను చింత హృదయశల్యమై బాధించుచుండెను.కాబట్టి మరునాడు రైలుస్టేషనుకుబోయి రైలునిమిత్తము వంతెనపై నిలచి చూచుచుంటిని. కొంతవడికి రైలు వచ్చినది. మిత్రుడు కనుపింపడాయెను. ఇంతలో నెవ్వరో వెనుకనుండి నాభుజములను పట్టుకొని నేను వెనుకకు తిరుగకుండ నిలిపిరి. తిరునారాయణే యైయుండునని తలచి, ఇంతలో పట్టు కొంచెము సడలుటచే దిరిగిచూచునప్పటికి వంకాయలపాటి శేషావతారమును, మరియొకమిత్రుడును గనుపించిరి. డిల్లీ