పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గోడలమీదినుండి పైవరకు నొక్కరాతితో కట్టబడినట్లున్న ఆభవనము నునుపుదేరి అద్దమువలె నీడ లీనుచుండును. ఈ నిర్మాణమునందు కలప వినియోగించక రాళ్ళతోడనే పైకప్పు అమర్పబడినది. భవనములోపల ప్రవేశింపగనే వెలుపలి గోడలకు కొంత యెడము వదలి, లోపలిభాగమున వెలుపలి రూపమునకు ప్రతిరూపముగ గట్టబడిన గర్భగృహము గలదు. ఈ రెండుగోడల మధ్యస్థలము గదులుగా నేర్పరుపబడినది. ఒక గదినుండి మరియొక గదికి పోవుటకు మధ్య గోడలు లేకపోవుటచే కోణములుదీర్చిన ఒకవలయముగుండ గర్భగృహమునకు చుట్టు ప్రదక్షిణముచేయుటకు వీలుగా నున్నది.ఇందు రెండు లేక మూడు గదులు దాటి మరియొక కోణమునకు జేరులోపల వెలుపలినుండి యొక పెద్దద్వారమును, దానికి నెదురుగ గర్భగృహమునకు బోవుటకు మరియొక ద్వారమును గలదు. ఈ గదులలో గోడలమీద ఆకులు పువ్వులతీగలు అందముగ చెక్కబడి పచ్చలు, గోమేధికములు, పుష్యరాగములులోనగు విలువగలరాళ్ళు పొదగబడి, ఎప్పుడును వాడకుండ జీవముతో పెరుగుచున్న పూదీగవలెనే గన్పడుచుండును. అక్కడక్కడ ఈ పుష్పలతలప్రక్క అందములగు చిలుకలు, గోరువంకలు మొదలగు పక్షులును మణివికారములై, జీవకళ యుట్టిపడుచుండును. ఈ గర్భగృహము గోళాకారమగు పెద్ద చంద్రశిలాగోపురము. దాని శిఖరము నర్ధచంద్రాలంకార నిర్మితము. ఈ గోపురము ఇన్నూరడుగుల యెత్తు. గోపురముక్రింద గర్భగృహమధ్యమున రెండు సమాధు లున్నవి. అం దొకటి షాజహానుభార్యదనియి, రెండవది షాజహానుదనియు చెప్పుదురు. ఈ సమాధులకు చుట్టును