పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఢిల్లీ దర్బారు

ఆసంవత్సరము డిశెంబరులో అహమ్మదాబాదులో కాంగ్రెస్‌మహాసభ సమావేశమయ్యెను. ఆసమయముననే డిల్లీలో ఎడ్వర్డు పట్టాభిషేకసందర్భమున ఉత్సవమునకు స్వతంత్రసంస్థాన ప్రభువుల నందరిని రప్పించి గొప్పవేడుకలు సలిపి ఆంగ్లేయ సామ్రాజ్య ప్రాబల్యమును ప్రకటింపవలెనని కర్జనుప్రభువు ప్రకటించి, రాష్ట్ర శాసనసభాసభ్యులు మొదలగువారికి ఆహ్వానములు పంపించెను. బందరునుండి కాంగ్రెసుసభకును, డిల్లీఉత్సవము జూచుటకును వెళ్ళవలెనని చాలమందిమి కుతూహల పడుచుంటిమి. మా కెవ్వరికి ఆహ్వానములు రాలేదు. ప్రయాణ సమయమునకు అందరును వెనుతగ్గిరి. నరసరావుపేటలో ప్లీడరుగా నుండిన వంకాయల శేషావతారముగారు మాత్రము ఒకసారి నాకు గనుపడి, తాను తప్పక వచ్చెదననియు బెజవాడ స్టేషనులో కలుసుకొందుననియు తారీఖుగూడ నిర్ణయించి చెప్పెను. నేను బయలుదేరి నిర్ణయించిన వేళకు బెజవాడ చేరితినిగాని నా కాయన కనపడలేదు. ఒక్కడనే రైలెక్కి చక్కగ అహమ్మదాబాదు చేరితిని. అక్కడికి హిందూపత్రికాధిపతిగా నుండిన కస్తూరి రంగయ్యంగారు, రంగస్వామయ్యంగారు అను హైకోర్టువకీలు, గౌరవనీయులగు పేరరాజుగారు మొదలగు దక్షిణప్రాంతీయు లెందరో సభకు వచ్చిరి. దక్షిణాదిప్రతినిధులకు ప్రత్యేకముగ బస ఏర్పరచిరి. చలి ఎక్కువగా నుండెను. స్నానమునకు బాగుగ మసలుచుండిన వేడినీళ్ళుగూడ పైన పోసుకొనునప్పటికి చల్లబడి శీతబిందువులు ఉష్ణబిందువులు కలియబోసిన