పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేకుండుట శోచనీయమని తలచి, ఒకపత్రిక ప్రకటించుటకు ప్రయత్నములు జరుపుట యుక్తముగదా యనుకొంటిమి. దానికి తగిన ప్రయత్నము లెవ్వరును పైన బెట్టుకొనరైరి. అంతట నేనును న్యాయవాదులలో నొకరగు దాసు నారాయణరావుగారును తుదకు ఒక తెలుగువారపత్రిక ప్రకటించవలెనని నిశ్చయించుకొంటిమి. నేను ముందు కావలసిన సొమ్ము విహితుల వలన వసూలుపరచియు, కొంత స్వంతమున పెట్టుకొనియి మా యిరువురిపేరను కృష్ణాపత్రిక యను పత్రికను ప్రచురించసాగితిమి. నారాయణరావుగారు తెలుగులో నాకంటె ఎక్కువ ప్రవేశము కలవారు, సరసమైన కవిత్వముచెప్పుటకు సమర్థులు. మొదటి రోజులలోనున్నశ్రద్ధ వారికి క్రమముగా సన్నగిల్లెను. మొదటి నుండియు వ్యాసములు, వార్తలు సమకూర్చి, పత్రిక వారము నాటికి అచ్చుబడి, వెలువడు భారమంతయు నేనే పూనితిని. పత్రికాకార్యాలయమున అవటపల్లి నారాయణరా వనునొకరు గుమాస్తాగా నేర్పడిరి. ఆయన ఉత్సాహశీలి గావున సంపాదకత్వనిర్వహణమున తోడ్పడుచుండెను. పత్రికపై నభిమానము నానాట హెచ్చుచుండెనుగాని తగినంత ధనసహాయములేక సహకారములేక విశేషవ్యాప్తి కలిగింపలేకపోయితిమి. ఇంతలో నారాయణరావుగారు అకాలమరణముపొందుట సంభవించెను. పత్రికాప్రకటన మానక సాగించుచునేవచ్చితిమి. ఆయూరిలో నొక్కటే ముద్రణాయంత్రము కలదు. అందు పనులు చురుకుగ జరగక పత్రిక సకాలములో చందాదారుల కందింపలేకపోతిమి. ప్రభుత్వోద్యోగులచర్యలు తీవ్రముగ విమర్శించినందుకును, సంఘమందలి దురాచారములను ఖండించినందుకును పురజనులు