పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రస్తావన

లోకమున పుట్టినది మొదలు ఇంతవరకును నాజీవిత యాత్ర యెట్లు నడచినదో వివరించుటవలన చదువరుల కేపాటి ప్రయోజనము కలుగును అను విషయము ఆలోచన చేసిన ఎడల నా జీవితములో మార్గదర్శకములగు విశేషములు గానరావు. ఇందువలననే ఆత్మకధ వ్రాయవలెనను సంకల్పము నాకు కలుగ లేదు. కాని మిత్రులు పలువురు మాటిమాటికి నా జీవితవృత్తాంతమును వ్రాయవలసినదని నొక్కి చెప్పుటచేత దానిని వ్రాయవలెనని ఇప్పుడు పూనితిని గాని దానికి కావలయు పరికరములు నే నమర్చుకొని యుండలేదు. కొందరు బుద్ధిమంతులగువారు తమ జీవితకాలములో నిత్యము జరుగు విషయములు దినచర్య (Dairy)గా వ్రాసి పెట్టుదురు. నాకు అట్టి అభ్యాసము లేక పోయెను. కాన నేనిప్పు డేమి వ్రాసినను నా జ్ఞాపకశక్తి ననుసరించియే. ఈ వృద్ధదశయం దాజ్ఞాపకశక్తియైనను దృడముగ నుండజాలదు. కాబట్టి నేను వ్రాయునది సంతృప్తికరముగ నుండజాలదని సందియము కలిగినను నా జీవితచరిత్ర వ్రాయుట నిశ్చితమైనదిగాన నిపుడట్టి లోపములనుగూర్చి యోచించి ప్రయోజన ముండదనుట స్పష్టమే.

సాధారణముగ నెవ్వరి జీవితమైనను మొదటినుండి తుదివరకు నొక్కరీతిగనే సుఖమునకో, దు:ఖమునకో భాజనముగాదు. సుఖదు:ఖములు రెండును అనుభూతములగుచుండును. కాని మొత్తమున నీ జీవిత మింతవరకు సుఖప్రదముగ నుండెనా, లేక