పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వాడు. ఈయన జిల్లాకాంగ్రెసుసంఘమునకు కొంతకాలము అధ్యక్షుడుగ నుండెను. కట్టమూడి చిదంబరరా వను మరియొక సెకండుగ్రేడుప్లీడరు కల్లకపట మెరుగని సత్స్వభావుడు, దయార్ద్రహృదయుడు; కాంగ్రెస్‌సంఘవిషయములందును, ఇతర సాంఘికవిషయములందును ఉత్సాహముతో పాల్గొనుచుండెను. న్యావాదులలోనేగాక ఉపాధ్యాయులును కొందరు కాంగ్రెస్ అభిమానులు సాంఘికసంస్కరణాభిలాషులు నుండిరి. బందరులో నోబిల్‌కళాశాలయను ఆంగ్లేయవిద్యాశాల యొకటి యుండెను. దానిలో శ్రీ వేంకటరత్నంనాయుడు ఎం. ఏ. గారు ప్రసిద్ధికెక్కిన ఉపాధ్యాయులు. వీరు మతమున బ్రాహ్మసమాజికులు. మిక్కిలి నీతిధర్మదీక్షారతులై తనయొంద్ద చదివెడి విద్యార్థులకు నట్టి నీతిమార్గము పట్టుపడునట్లుచేయవలెనని ప్రయత్నము చేయుచుండిరి. ఆరోజులలో భోగముమేళములు వివాహములు మొదలగు శుభసమయములందు రప్పించి సానులచేత అభినయముతో ఆటలాడించి పాటలుపాడించుట సామాన్యముగ జరుగుచుండెను. భోగముమేళము లేనిపెండ్లి పెండ్లియేగా దనుచుండిరి. దేవాలయములలోను దేవునిఊరేగింపులందును భోగముమేళములు తప్పక నడచుచుండెను. ఈ ఉత్సవములకు వచ్చువా రనేకులు భోగముమేళమునందలి ప్రీతిచేతనే వచ్చుచుండిరి. గొప్పవారును, కొద్దివారునుగూడ తమయింట కార్యములలో భోగముమేళము లేకపోయినయెడల గొప్పలోపముగ తలంచుచుండిరి. కాని వాటియందలి అవినీతి గ్రహింపజాలకుండిరి. కాని శ్రీ వేంకటరత్నమునాయుడుగారు తమ విద్యార్థులచే అట్టిమేళము లున్నచోటికి ఎప్పుడును పోమని