పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వేలము వేయబడునని కృష్ణాజిల్లాగెజిట్‌లో ప్రకటనగావించిరి. నేను గుంటూరు వెళ్ళి మానాయనగారితో సంప్రదింపగా వారు మనకు అక్కరలేదని చెప్పిరి. నేను గట్టిపట్టు పట్టినమీదట నాకు రు 300/- లు మాత్రమిచ్చి భూమికొనుటకు నన్నే పొమ్మనిరి. ఆసొమ్ము చాలదని తెలిసియు ఏదియో మొండి ధైర్యముతో వెళ్ళి పాటపెట్టితిని. జాగర్లమూడి నాయుడు అను నొక పెద్ద ఆసామీతో పోటీగా పాడవలసివచ్చెను. ఆయన పట్టుదలతో పాటపాడుటచే ధర హెచ్చిపోయెను, మొత్తము 21 యకరములభూమి 1800 రూపాయలకు నాపేరనే కొట్టివేయబడెను. 300 ల రూపాయలుమాత్రమే భూమినిమిత్తము ఖర్చుపెట్టదలచిన మాతండ్రిగారి అభిప్రాయమునకు భిన్నముగా స్వతంత్రించి ముందువెనుక లాలోచించక భూమియందలి ఆశతో హెచ్చుపాటకు పాడితిని. ఆవేలము ఖాయపడుటకు ఆరోజుననే 500 ల రూపాయలు చెల్లించవలసివచ్చినది. నావద్ద నున్న 300 లు గాక తక్కిన 200 ల నిమిత్తము ఆయూరిలో బ్రహ్మాండం బాపయ్య గారను ధనికుడగు ప్లీడరును చేబదులడిగితిని. ఆయన నిర్మొగమాటముగ తనదగ్గర పైకము లేదని తప్పించుకొనెను. అంతట మాకు దూరపుబంధువులు కాజ సుబ్బారావుగారు బాపట్లతాలూకా హెడ్‌అక్కౌంటెంటుగా నుండిరి. వారు మరియొకరివలన 200 లు ఇప్పించుటచేత 500 ల రూపాయలు సర్కారుకుచెల్లించి గుంటూరుచేరితిని. మానాయనగారికి సవిస్తరముగా అన్నివిషయములును చెప్పితిని. 1800 లకు 21 యకరముల భూమి కొనుగోలువిషయమై సమ్మతించిరిగాని తనయొద్ద పైకము హాజరులేదుగనుక ఎక్కడనైన నోటువ్రాసి రుణముతేవలసినదిగ