పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూర్తి కూర్చున్న పీఠముదగ్గరకు బోయి వారితో నేమియో ఎవ్వరికిని వినపడకుండ నచ్చచెప్పి, ఉత్తరువు వేయించుకొనుట చూచుచుండియు, అది, పిటీషన్ అనిగాని దానిమీద నుత్తరువు పొందుచున్నారనిగాని నేను తలచలేదు. ఏదైన పిటీషన్ పెట్టిన ఎడల తక్కిన అన్ని వ్యవహారములలోవలెనే బహిరంగముగనే పిటీషన్ పెట్టబడుననియు నేను వకాల్తును అఫిడివిట్‌ను దాఖలు చేసి చెప్పవలసిన అంశములు చెప్పవచ్చు ననుకొంటిని. తాయి సుబ్బారావునాయుడుగారుకూడ ఆఫైలుజప్తు ఉత్తరువు పడినప్పుడు కోర్టువెలుపల వరండాలో నుండెను. ఈఉత్తరువు పడినట్లు విని, నాయొద్దకు వచ్చి "ఏమి చేసితివయ్యా" అని నాపైన గొప్ప అయిష్టముతో పలుకుచు ఇంతగా నమ్మితే ఇంత మానభంగము మీవలన గావలసివచ్చెనని నన్ను చురచురచూడసాగెను. అప్పటికి జరిగినమోసము గ్రహించితినేకాని అప్పటికైన వెంటనే న్యాయమూర్తియొద్దకు బోయి తగినంత ఆస్తి జామీనిచ్చుటకు కక్షిదారుడు సిద్ధముగానున్నాడని చెప్పవచ్చునను ఆలోచన నాకు తోచక పోయెను. ఫైలుజప్తుకు ఉత్తరువు పడినదన్నతోడనే ఇక నేమియు చేయశక్యముగా దనుమాట యొక్కటె తలచుకొని మిక్కిలి తెలివితక్కువగ ప్రవర్తించి, మనల నమ్ముకొన్న కక్షిదారున కవమానము గూర్చితినేఅని మిక్కిలి చింతించితిని. నా యవజ్ఞత నామిత్రులగు లక్ష్మీనరసింహము, హనుమంతురావుగార్లకు ఖేదము కలిగించెను. ముఖ్యముగ కక్షిదారునకు ఏవిధమయిన అవమానము జరుగకుండ వ్యవహారము నడుపబడునని అభయహస్తమిచ్చినకారణమున ఆయనకు మరింత మన:క్లేశము కల్గెను. ఈఉత్తరువు కోర్టులో పడి