పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సంస్థగా పరిణమిల్లినది. అడయారులోని కార్యస్థానమునుండి మేడమ్ బ్లావట్‌స్కీ, దూరదృష్టి దూరశ్రవణపరకాయప్రవేశములు మొదలగు అద్భుతకార్యముల ప్రదర్శించుచుండెననియు, అక్కడ నుండి హిమాలయములలోని కుటీ, హ్యూమీ మొదలగు మహానుభావులతో సంభాషణలు జరుపుచుండెననియు, చెప్పుకొనుచుండిరి. కొందరు ఈమె దగ్గర శుశ్రూషచేయనారంభించిరి. థియసాఫికల్ సొసైటీజర్నల్ అను పత్రికలో ఈఅద్భుతచర్యలు ప్రకటితములగుచుండెను. మరియు దివ్యజ్ఞానసమాజము కేవలము ఆర్యమతమునందేగాక ఇస్లాము, క్రైస్తవ, బౌద్ధమతములలోగూడ ఉదారములు, ఉన్నతములునగు ధర్మములను, ఆశయములను గ్రహించి మన్నించుచుండెను. ఈసమాజము కులభేదములు, జాతిభేదములు పాటింపదు. ఈసమాజమున చేరినంతమాత్రమున వారివారిమతముల విడనాడిన ట్లెంచరాదు. ఇట్లు స్వేచ్చాస్వాతంత్ర్యము లున్నకారణమున హిందువులు, క్రైస్తవులు, ముసల్‌మానులు, బౌద్ధులు, జైనులు మొదలగు పలుమతములవారు ఆసమాజమున సభ్యులుగాచేరిరి. ప్రతి ముఖ్యపట్టణమునందును దివ్యజ్ఞానసమాజశాఖలువెలసెను. అందు భాండాగారములు నెలకొల్పిరి. సర్కారు ఉద్యోగులు పలువురు ఈసమాజములో జేరిరి. ఇందువలన ఆంగ్లేయవిద్యాధికులలో హిందూమతమునందు అభిమానము ప్రబలసాగినది. పురాణములలో చెప్పినగాధ లన్నియు వాస్తవములైనట్లు సకారణముగా స్థాపించుచుండుటచేత, కొన్ని వెఱ్ఱివిశ్వాసములు వ్యాపింపనారంభించెను. ఇట్లు దివ్యజ్ఞానసమాజప్రభావము పలుదెసల వ్యాపించుచుండగా "కుట్‌హ్యూం కూలిపోవుట"