పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోక్లే మొదలగు ముఖ్యులుతప్ప సభ్యులలో పలువురు మహాసభాకార్యక్రమము వినోదముగ భావించుచు వక్తల యుపన్యాసముల పదగాంభీర్యము, భావౌన్నత్యము, తర్కశుద్ధి, తీవ్రతమొదలగు విశేషముల నెన్నుచుండిరి. కాంగ్రెసుకార్యభారముగాని బాధ్యతలుగాని వారికి పట్టలేదనియే చెప్పవచ్చును. ఒకరోజు మధ్యాహ్నము అట్టివా రందరును గూడి చెన్నపురిలో ప్రసిద్ధురాలగు కళావంతురాలిని పిలిపించి ఆమెచే పాటలు పాడించి, అభినయముజరిపించి తమ రసికత్వమును వెల్లడించిరి.

మూడురోజులు సభాకార్యములు నడచినవి. నాల్గవనాడుదయమున నిదురలేదునప్పటికి అందరును వెడలిపోయిరి. ఈ మహాసభాకార్యక్రమమును అందు పాల్గొనిన దేశభక్తుల స్వరూపములును మా హృదయములందు నూతనోత్సాహము గల్పించినవి. అట్టిసభలో మాచేతనైన సేవచేయుటకు అవకాశము కలిగెనుగదా యని ఆనందము నొందితిమి. ఇట్లు 1887 వ సంవత్సరములో మొట్టమొదట కాంగ్రెసుమహాసభతో నాకు సంబంధము చేకూరెను.

చెన్నపట్టణము పెద్దది యగుటవలన మా కళాశాలకు సమీపమున నున్న లింగిచెట్టి తంబుచెట్టి వీధులను, ఆర్మీనియన్ చర్చివీధి ఫోఫమ్సుబ్రాడ్‌వే చైనా అంగళ్ళు పచియప్పకళాశాల చిల్లరసానులు (Second hand) చౌకగా దొరకెడి ఈవినింగు బజారు సెంట్రల్ రైలుస్టేషనులు గాక తక్కిన తిరువళ్ళిక్కేణి, మైలాపురము, అడయారు, ఎగ్మూరు, నుంగంబాకం, రాయపురము,