పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తనకున్న వైషమ్యబుద్ధిని వెలిబుచ్చుచు సమ్మెజరిగినందుకు కళాశాలాధికారుల అసమర్థతను విమర్శించుచు ప్రతిదినమును ఏదో ఒకవ్యాసము వ్రాయుచు, మిషనరీ సంఘములవారు క్రైస్తవకళాశాలకు చేయుచున్న ద్రవ్యసహాయము వ్యర్థమని చాటింపసాగెను.

ఈసమయమున కళాశాలాప్రిన్సుపాల్ డాక్టరు మిల్లరుగారు వారి స్వదేశమగు స్కాట్లండునకు సెలవుమీద పోయియుండెను. రివరెండు డాక్టరు కూపరు అను అతిశాంతపురుషుడు కేవల ఋషితుల్యుడు ప్రిన్సిపాల్‌గా నుండిరి. వీరు ఆరోజులలో అప్పుడప్పుడు మావిద్యార్థివసతిగృహమునకు వచ్చి, ఈసమ్మె పనికిరాదని చెప్పుచుండిరి. లాయడ్‌గారి అవమానకరమగు దుర్భాషణను గురించి చెప్పగా "గోరంతలు కొండంతగా చేయుచున్నా" రని చెప్పి, మమ్ము సమాధానపరుప యత్నించుచుండెను.

ఇట్లు పదిరోజులు జరుగునప్పటికి మాకును త్రోవయేదియు దొరకకుండెను. గౌ. ఆనందాచార్యులవారు, హైకోర్టు వకీలు కాంగ్రెస్‌మహాసభకు అధ్యక్షతవహించినవారు గలరు. క్రైస్తవకళాశాలలో పూర్వము వారు చదివికొనిరి. మరియును వారు గవర్నరుజనరల్‌గారి (Executive Council) కార్యాచరణ సలహాసంఘములో సభ్యులు. ఈయన మాసమ్మె పదియవనాడు మాసభకు వచ్చి, తాను కళాశాలాధికారులతో మాట్లాడితి మనియు, ఇక నెప్పుడును హిందూమతమునుగురించి యెట్టి దుర్భాషలుగాని ఆడకుండ కట్టుబాటుచేయుదుమని తమతో