పుట:Konangi by Adavi Bapiraju.pdf/292

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

“ఖుర్ హు అల్లాహెూ ఆహద్ అల్లాహుసమన్ లం ఎలిద్ వలం యూలద్ వలం ఎఖుల్లుహు ఖుర్ ఒన్ ఆహద్” (భగవంతుడు ఒక్కడు - గుణాతీతుడు - జన్మ లేనివాడు - ఇతరుల కననివాడుఅతడే ఏకైక మహాభావము) ఆ తర్వాత మూడు దినాలకు డాక్టరు రెడ్డి, చౌధురాణీల వివాహం జరిగింది. ఇంతమందీ ఆ వివాహానికి వచ్చారు. రెడ్డి ముఖ్యబంధువులందరూ వచ్చారు. ప్రథమంలో రిజిష్టరు వివాహం జరిగింది. తర్వాత కోనంగి దర్శకత్వంలో అద్భుతమయిన వివాహమూత్సవం జరిగింది. సామ్యవాది అయిన డాక్టరు రెడ్డి “ఈ ఖర్చంతా ఎందు” కన్నాడు. “నువ్వు 'సామ్యవాదివే. నీ భార్య జాతీయవాది. ఖర్చు నాది. నీకెందు కాగొడవ?” “నా పెళ్ళికి నిన్ను ఖర్చు పెట్టనిస్తానా?” “అయితే మనం ఇద్దరివంతులుగా ఖర్చు పెడదాం బూర్జువాల ధనం ఖర్చుపెట్టడమే మనవంతు. 1. బీదవాడి పూలతోటలు ఎక్కడున్నాయో ఆ పూలు కొనడం. 2. చిన్నకూరల దుకాణాలు వగయిరాల దగ్గర సరుకులు కొనడం. 3. బీదవంటవారిని తీసుకొచ్చి వంట చేయించడం. 4. తోలుబొమ్మలాట, వీధినాటకం, జంగాలవారి కథ అందంగా చెప్పించడం; సంగీతం కచ్చేరి, భరతనాట్యం ఏర్పాటుచేయడం. 5. బీదవారికి సంతర్పణ, వస్త్రదానం, కార్మికులకు భోజనాలు. “ఇదయ్యా నా కార్యక్రమం. ఇందులో సగం ఖర్చు నీది. సగం ఖర్చు మాది. అంటే మేం ఆడపెళ్ళివారం కాబట్టి ఆడపెళ్ళివారిది అన్నమాట.” “ఎంత పెద్దమనిషివి. ఈ కరువు రోజులలో, యుద్ధం భయంకరంగా సాగే రోజులలో?” “నీ డబ్బు దాచుకొని దేశానికి సహాయం చేస్తావా?” “నీ యిష్టం వచ్చినట్లు చేయి నాయనా!” “అలాగేనయ్యా! రెడ్డి మహారాజా!” “నన్ను మహారాజును చేయకు!” “నన్ను నాయన్ను చేయకు!” వివాహ మూత్సవములు అద్భుతంగా జరిగినాయి. కోనంగి స్నేహితులందరూ వచ్చినారు. అనంతలక్ష్మి స్నేహితురాండ్రందరూ వచ్చినారు, చిన్నరంగారావును ఒక్కరూ వదలరు. వాడు ఒక్కటే కిలకిల. ఓ ఉయ్యాలలో పండుకొని ఒక్కటే అల్లరి. కాళ్ళు కదుపుతాడు, చేతులు ఆడిస్తాడు. 282 అడివి బాపిరాజు రచనలు - 5