పుట:Konangi by Adavi Bapiraju.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయలక్ష్మికి జమీందారుడంటే ప్రేమలేదు. తన కులపు స్త్రీలకు ప్రేమలు పనికిరావని తల్లి బోధించిన నీతి ఆమెకు తెలిసితీరును. “నీవు శృంగార సాయికవు. అభినయ శిరోరత్నానివి. శృంగారం ఆభినయించు. అష్టవిధ నాయికల్ని నాట్యంచేయి” అని తల్లి చెప్పిన వాక్యాలు ఎప్పుడూ మరవలేదు జయలక్ష్మి.

కాబట్టి జమీందారుడు విచారిస్తూ విచారిస్తూ జయలక్ష్మిని వదలలేక దుఃఖిస్తూ బహుశః ఇంద్రలోకమే చేరిఉంటాడు.

జయలక్ష్మి గౌరవానికి మూడు నెలలు దుఃఖించింది. కచ్చేరీలు మారింది.

అలాంటి కచ్చేరీలలో ఒక అయ్యగారింట జరిగిన నాట్యసభలో వర్తకంచేసే ఒక లక్షాధికారి అయ్యంగారు ముప్పదిఏళ్ళ ఈడువాడు భార్యపోయి దుఃఖిస్తున్నవాడు ఆ జయలక్ష్మిని చూచాడు. ఆ శుభముహూర్తంలోనే ఆత్మదగ్గిరనుండి వేలిగోరువరకూ ఒక ప్రేమ ఝంఝామారుతంలో ఆవిడకు సర్వార్పణమైపోయాడు. కాని ఆ రోజుల్లో ఆవిడ చూపులుతప్ప ఈతనికి ఏమీ అర్పించుకోలేకపోయింది. హృదయంలో పడమటిభాగం ఆ చూపులో వంపించుకుంది.

కాని ఆ జమీందారుగారు ఏదో లోకం చేరారు అని తెలుసుకున్నాడు. రాకెట్ విమానాలు లేవు. కనక తిరిగి వస్తాడన్న ఆశకు తావులేదు. ఆ మరుసటి క్షణంలో తన మైలాపురం ఇంటినుండి గంటకు నలభైమైళ్ళ సగటువేగంతో శ్రీమాన్ శ్రీరంగత్తిరుమల రంగయ్యంగారు కారుకు కూడా ఒకేసారి పెద్ద భోజనం పెట్టి తంజావూరు ప్రాంతంలో ఉన్న మన్నారుగుడికి ఉల్కాపాతంలా వెళ్ళిపోయాడు. మన్నారుగుడిలో జయలక్ష్మి రంగులమేడ ఉంది.

శ్రీమాన్ శ్రీరంగత్తిరుమలరంగయ్యంగారు వెళ్ళి దుఃఖిస్తున్న సంతతకన్య అయిన జయలక్ష్మిని ఊరడించ ప్రారంభించారు. ఆమె దుఃఖిస్తున్న మూడు నెలలూ ఆమెను రహస్యంగా ఊరడిస్తూ ఉన్నాడు.

ఆమె ఊరడిల్లి ఇంతకాలంవరకూ తన ఇనపపెట్టెలో దాచుకున్న ఆత్మనుతీసి తన బ్రతుకులో ధరించి చూచుకుంది. ఆ ఆత్మ శ్రీమత్తిరుమలరంగయ్యం గారిని వదలనంటుంది.

ఆనాటినుంచి ఆయనకు ఆమె భార్య. రంగయ్యంగారు ఆమె ప్రేమలో సర్వశృంగార మాధుర్యాలు రుచి చూచారు. పుస్తకట్టి వివాహం చేసుకోలేదు కాని, ఈనాడు లా ప్రకారం భార్యాభర్తలయిన జంటలలో వారిరువురకు ఒకరిమీద ఒకరికున్న ప్రేమ ప్రణయము, కాంక్ష, ఆపేక్ష, గౌరవము, అభిమానము ఏ ఒక్క జంటకన్నా ఉంటుందా?

వారిరువురి దాంపత్యఫలమూ అనంతలక్ష్మి. అనంతలక్ష్మి రసావిర్భావ. అనంతలక్ష్మి ప్రేమపూజావరము. అనంతలక్ష్మి ఆనంద తప సంజనితసిద్ది! జపాన్ చక్రవర్తి కూతురు అలా పెరగలేదు. రాక్ ఫెల్లరు మనుమరాలు ఆ మురిపాలు పొందలేదు.

ఏడాదికోసారి నగలన్నీ మారేవి. నెలకోసారి దుస్తులు మారేవి. రోజుకోసారి ముద్దుల విధానం మారేది.

చిన్నతనంలో పూర్ణారుణం రంగరించి బంగారు, బాలికాతనంలో కొంచెం గులాబిరంగు కలిపివేసిన మేలిమి. యవ్వనప్రాదుర్భావంలో మేలిమీ గులాబీ సమపాళ్ళు. నవయవ్వనంలో వేయితులాల మేలిమిలో 200 గులాబీల రంగు 100 కమలాల వర్ణము కలబోసి, అయిదుశేర్ల ఆవువెన్న, రెండు రాకా పూర్ణిమల వెన్నెల