పుట:Konangi by Adavi Bapiraju.pdf/230

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

“ఆరు పత్రికలకు చందాదారులు ఉండవద్దా?” “ఒక్కసారి ఆరు పత్రికలూ వస్తే అన్నీ దెబ్బతింటాయి. నిజమే! ఒక్కటొక్కటే రావాలి. ఒక్కొక్కపత్రిక ఒక్కొక్క ప్రత్యేకతా, వ్యక్తిత్వమూ సంపాదించు కోవాలి.” “ఏమిటా వ్యక్తిత్వము?” “పేపరు రూపం, పేపరు వార్తలిచ్చే విధానం, పేపరు సంపాదకీయం వ్రాసే విధానం, కొన్ని ప్రత్యేక రచనలూ ఉండాలి.” “ఆంధ్రప్రభ నారాయణమూర్తిగారు “పాన్ సుపారీ” అని వ్రాస్తారు. అలాగా?” “అవును, 'టైములో' కాండిడన్' క్రానికల్” “బీరబల్' లాంటివి!” “నవజ్యోతి”కి పెట్టుబడిడబ్బు పెట్టినవారు ఓ పదిమంది ఉంటారు. అందరూ తలో ఇరవైవేలూ వేసుకొని రెండులక్షలు చేసి ప్రారంభించారు. జయలక్ష్మి, డాక్టరు రెడ్డి, ఆనంతకృష్ణయ్యంగారు, డాక్టరు రెడ్డిగారి స్నేహితులు కొందరు కోనంగి సినీమా స్నేహితులు కొందరు, రియాసత్ ఆలీ మేనమామా వాటాదార్లు. పేపరు రూపం చాలా ఆందంగా వచ్చేటట్టుగా కోనంగి స్వయంగా తాను చూసుకుంటాడు. మొదట పేజీ ఒక్కసారి ఆకర్షించేటట్టు ఆంధ్రప్రభ చేస్తుంది. ఆంధ్రపత్రిక కొంచెం నిదానంగా నడుస్తుంది. | కోనంగి ఆలోచించాడు, ఆలోచించాడు పత్రిక ప్రారంభించక ముందే. దినపత్రికకు సాధారణంగా వారానికి రెండుసార్లు ప్రపంచవార్తలలో ఒకటి ముఖ్యమైన వార్త ఉంటుందనీ, అతడు ఆరునెలలు పాత అంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, హిందూ, ఎక్స్ ప్రెస్ పత్రికలు చూచి కోనంగి ఈ నిశ్చయానికి వచ్చాడు. పదిహేనురోజుల కొకసారి ఒక్కటి మరీ ముఖ్యవార్త వస్తుందట! . | నెలకు ఒక్కటి మరీ మరీ ముఖ్యవార్త వస్తుందని అతడు తేల్చుకున్నాడు. ఇక వర్ణించడానికి కూడా అతీతమయి అద్భుతమయిన వార్త మూడునెలల కోసారి వస్తుందట. | ఈలాంటి వార్తను గ్రహించటం సంపాదకత్వం యొక్క ప్రజ్ఞ అని కోనంగి తన సంపాదకులతో, సహాయసంపాదకులతో తన విజ్ఞానమంతా వెల్లడిస్తూ చెప్పినాడు. ఒక సంపాదకుడు: అది గ్రహించి ఏమి చెయ్యాలండీ? కోనంగి: నమిలి మింగండి అని కాదు. ఆ వార్త చేతబట్టుకొని, ఆ వార్తకు నాయకుం డెవ్వరో నిశ్చయింపవలయును. (అందరూ నవ్వుతారు) కోనంగి: నవ్వకండి రామారావుగారూ, మొఖంబు అతి ముచిగుంభనంగా అనగా సీరియశంబుగా పట్టి వినండి! రామారావు: అవధారు! కోనంగి: ఆవార్త అనే కావ్యానికి నాయకు డెవరో ఆయన చిత్రం సంపాదించాలి! శ్రీనివాసరావు: ప్రతి ముఖ్యవార్తా కావ్యము వంటిదే అంటారు. అయితే కథానాయిక కూడా ఉంటుందా అండీ? కోనంగి: ఒక్కొక్క ముఖ్యవార్తకు కథానాయకుడో, కథానాయికో ఉంటారు. నాయకుడైతే సాయకిన్నీ, నాయిక అయితే నాయకుడున్నూ తెర వెనుక ఉంటారు. 220 అడివి బాపిరాజు రచనలు - 5