పుట:Konangi by Adavi Bapiraju.pdf/203

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

పార్వతి: ఇక అనంతం మనతో మాట్లాడుతుందా? అలమేలు: ఎందుకు మాట్లాడుతుందీ! మాట్లాడేందుకు లక్ష స్నేహితురాళ్ళ ముద్ద వస్తున్నాడుగా! అంబుజం: కోటి స్నేహితురాళ్ళు ముద్దకట్టినా మద్రాసంత లావవడానికి అసలు ఆనందం ఏమి ఇవ్వగలరే! పార్వతి: ఏమిటే ఆ ఆనందం? అంబుజం: అనందం సంగతి అనంతానికే తెలియాలి? మనకా విషయాలలో ఏమి అనుభవం ఉందే? అనంతం: మిమల్ని ఆ అనుభవం సంపాదించు కోవద్దన్నాన్నా? ఆ అనుభవం మీకు సమకూర్చేందుకు సిద్దంగా ఉన్నారు ముగ్గురు. పార్వతి: ఎవరు బాబు వాళ్ళు? అనంతం: ఈపాటికి పుట్టకుండా ఉంటారా వాళ్ళు? అలమేలు: వాళ్ళు చిన్నబిడ్డలు కాబోలు తల్లీ! అనంతం: ఏమో, మీ ముగ్గురి విషయమూ చంద్రహాస నాటకంలా అవుతుందేమో? పార్వతి: ఏం కులుకమ్మా! ఓహెూ పాడవే పాట! వాహినీ వారి పుణ్యమా అని “వచ్చాడే నా మొగుడూ!” పాట పాడేయి. అంబుజం: ఆ పాట “వచ్చాడే మా బావ !” అన్నదే. పార్వతి: బావైతేనేం, మొగుడైతేనేం, మొగుణ్ణి బావా అని పిలువకూడదా? అనంతం: పార్వతి తన మొగుణ్ణి “బావా” అని పిలుస్తుంది. అంబుజం “మొగుడా” అని పిలుస్తుంది. అలమేలు: అనంతం “గురువుగారూ!” అని పిలవడం నేను విన్నాలెండర్రా! పార్వతి: అందరికీ చదువు చెప్పే గురువే భర్త అవడానికి సాధ్యం ఎల్లా చెప్పండీ! అనంతం: అందుకనే “మొగుడా' అని పిలుస్తానన్నానుగా? పార్వతి: నా కిష్టమే! ప్రియ ‘హబ్బీ' అంటాను వచీరావు మల్లే! కాదు, కాంతం మల్లే “ఇదిగో చూడండి” అంటాను. అనంతం: ఆ పుస్తకాలన్నీ నేనూ చదివానోయ్! అలమేలు: నేను చదవలేదు. నాకు తెలుగు రాదుగా! అంబుజం: నేను మాత్రం చదివానా! అనంతం: మీ ఖర్మ. “నాయడుబావా!” అను. అతడు “మఘవ మస్తక మకుట మాణిక్య రాజ్జీ!” అంటాడు.. పార్వతి: లేదూ, సుందరీ! అని పిలుస్తాడు నన్ను! అనంతం: నువ్వు “నందా!” అని పిలు. అంబుజం: మీ భాష నాకర్థం అవటం లేదర్రా! పార్వతి: నేను లాటిను మాట్లాడడంలేదు. అనంతం: నేను హీబ్రూలో జవాబు చెప్పడం లేదు. అంబుజం, అనంతం: తప్పకుండా మీ ఇద్దరూ నీగ్రో భాష మాత్రం మాట్లాడుతున్నారు. కోనంగి (నవల) 193