పుట:Konangi by Adavi Bapiraju.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

(8) రెడ్డిగారికి కారాగారం అలవాటే, అందులో 'ఏ' తరగతి బంధితుడు. క్యాంపు మంచం, పరుపు, కుర్చీలు, అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. కోనంగీ డాక్టరూ రాత్రిళ్ళు తప్ప పగలల్లా కలిసే ఉండేవారు. అనేక విషయాలనుగూర్చి చర్చలు సాగుతూ ఉండేవి. ముఖ్యమైన సమస్య సామ్యవాదం. ప్రపంచోద్దరణ సామ్యవిధానం వల్లనే జరుగుతుందని రెడ్డి అంటాడు. కోనంగి తన వాదనతో సామ్యవిధానం ఒప్పుకుంటాడు. కాని, అందుకు మార్గం గాంధీ విధానం అంటారు. కోనంగి: రష్యా రాజకీయ విధానం ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉంది. ప్రస్తుతం. కాని స్టాలిన్ ఎందుకు రక్షకభటులతో కాపలా కాయించు కుంటూ వెడతాడు? డాక్టరు: ప్రాణరక్షణ ముఖ్యావసరం, ఎంత ప్రజారాజ్యం స్థాపించినా, యితర రాజ్యాల వారికి రష్యా జయమువల్ల ఉడుకుబోతుతనమూ, కోపమూ ఉద్భవించాయి. రష్యా రాజ్యవిధానం మంటగలిపి, రష్యాను నాశనం చేయాలని వారెప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో స్టాలిను చావు మొదటి కోరిక వారికి.. కోనంగి: రష్యా దేశంలోని వాళ్ళెవరూ స్టాలిన్ కు విరోధులు లేరంటావా? డాక్టరు: లేరనను. ప్రతి దేశంలోనూ, ఉత్తమాశయాలను నాశనం చెయ్యాలి అన్న దుర్మార్గులు ఉండనే ఉంటారు. కోనంగి: మన దేశంలో గాంధీజీకీ వ్యతిరేకులు, గాంధీజీ పేరు చెప్పితే, కాంగ్రెను పేరు చెప్పితే మండిపోయేవారు లేరా? డాక్టరు: ఉన్నారు. కోనంగి: అయితే బాపూజీ యెందుకు రక్షకభటుల్ని పెట్టుకోదు? కాంగ్రెసు మంత్రి వర్గాలున్నంత కాలం మంత్రులెవ్వరూ రక్షకభటుల్ని పెట్టుకోలేదేమీ? కాంగ్రెసు నాయకులకు రక్షకభటులు లేరేమి? డాక్టరు: అది ఒక గొప్పా? నిజమైన స్వాతంత్ర్యం మన దేశానికి వస్తే, అప్పుడు మంత్రులూ గింత్రులూ రక్షకభటుల్ని పెట్టుకోవాలి. ఇవాళ ఇంగ్లీషువారు నిన్ను రక్షిస్తున్నారు గనుక నీ ఆటలు సాగుతున్నాయి. కోనంగి: అన్నావు నాయనా అంతమాటాను. పాపం ఇంగ్లండులో వాళ్ళ రాజ్యమే కాదుటండీ, అక్కడ కూడ స్కాట్లండుయార్డు, రక్షకభటులు మంత్రులనూ, ముఖ్యమంత్రినీ ఎందుకు కాపలాలు కాస్తుంటారు. డాక్టరు: ఇంతకూ నీ వాదన ఏమిటి నాయనా? కోనంగి: నా వాదన ఏమిటో తమకు అర్థం కాలేదు కాబోలు! | అంత మట్టితలకాయా నీది? మట్టి అయినా పంట పండుతుంది; బూడిదా? డాక్టరు: బూడిదలో అనేక రసాయనాలున్నాయి. అన్నీ ఉపయోగించవచ్చును. కోనంగి: ఏమీలేని ఖాళీ బుట్టా? డాక్టరు: గాలి ఉంటే గాలి ఉపయోగం. గాలి లేకపోతే 'ఎక్సురే'కు ఉపయోగం. కోనంగి: సరే ఎందుకో అందుకు ఉపయోగించు తమ్ముడూ! నా మాటలు అర్థం చేసుకోడానికి మాత్రం ఉపయోగించకు. అడివి బాపిరాజు రచనలు - 5 166