పుట:Konangi by Adavi Bapiraju.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిఅందరూ:

 బంగారు నేలలో

పసిడి పండిస్తాము

బంగారు మా నేల మాకుండగానూ

పసిడి మాకేల!

పసిడి మా కేల?


కెమేరా: 1 దగ్గిర గ్రహణం (క్లోజ్ షాట్) పొలంలో భూమి నాగేటిచాలుగా మారుతో వుంటూ జరిగిపోతోంది - 5 అడుగులు! కోణం ప్రక్కనుంచి.

2. చాలా దూరం అవుతూ వుంటుంది. మధ్యగ్రహణం (మిడ్షాట్) చాలూ, మేడితోకా, వెనక రైతూ కనబడతారు.

3. ఇంకా దూరం - మధ్యదూరం (మిడ్ లాంగ్ షాట్) నాగలి, ఎద్దులు, రైతూ కనబడతారు.

4. దూరం - దూరగ్రహణం (లాంగ్ షాట్).

5. కెమేరా నెమ్మదిగా తిరుగుతూ పొలం చూపెట్టుంది.

6. రాట్నంమీద వాలుతుంది మధ్యగ్రహణం. రాట్నం తిరగడం. కొంచెం రాట్నం తిప్పుతూ దారం ఒడికే నాయికను చూపెట్టుంది.

7. ఇంకా కదులుతుంది కెమేరా; తవ్వే నాయకునిపైన వాలుతుంది.

8. ఎ. బి. సి. డి. ఇ ఎఫ్. జి. హెచ్. గా కెమేరా విభజన ఇంతవరకూ!

9. ఇక్కడ నుండి సంభాషణలు, (మిడ్ షాట్లు) నాలుగు క్లోజప్పులు నాయిక, మూడు నాయకుడు.

10. నాయకుడు మాట్లాడుతూ వుంటే నాయిక ప్రేమచూపుల క్లోజప్పులు నాలుగు. మూడు ముఖములు మాత్రం, ఒకటి కన్నులు మాత్రం. నాయకునిది ఒక క్లోజప్పు ముఖం మాత్రం.

షరా: ఈ అయిదు క్లోజప్పులూ ఆయా ఇంగ్లీషు అక్షరాల క్రింద ఒకటి, రెండు, నాలుగయిదు.

8

అలా ఉంటుంది బొమ్మతీసే వ్రాత. దీన్నే “ఘాటింగ్ స్ర్కిప్టు” అంటారు.

కోనంగి కొంచెం బంగారుఛాయ మనుష్యుడు కాబట్టి హాలీవుడ్లు మేక్స్ ఫాక్టరు కంపెనీవారి వేషధారణ రంగులలో 26వ నంబరు క్రీము మొగం అంతా రుద్దుకొని బాగా అద్దుకొని మర్దనా చేసుకొన్నాడు. ఆ తర్వాత ఆ నంబరు ద్రవపదార్థం పెట్టి మర్ధనా చేసుకొన్నాడు. ఆ తర్వాత ఆ నంబరు పొడితో మొగం అద్దుకొన్నాడు. అప్పుడు వేషం తయారుచేసే ఆయన, కళ్ళకు, రెప్పలకు, కనుబొమ్మలకు నల్లరంగు వేశాడు. పెదవులకు కొంచెం ఎరువు దిద్దాడు.

మెడకూ చేతులకూ ఆ నంబరు ద్రవపదార్ధము రాసుకొని పొడి జాగ్రత్తగా అద్దుకోన్నాడు కోనంగి.

మేక్స్ ఫాక్టరు మొదట ఒక పెద్ద సినీమా కంపెనీలో వేషాలువేసే కళాకారుడు. అదివరకున్న రంగులు దేహానికి హానికరమని ఎంచి బాగా పరిశోధనచేసి కొత్తరంగులు కనిపెట్టాడు. సినీమాలో ఛాయాగ్రహణం వర్ణవిభేదవిధానరూపమై పరిణమించి, గ్రహణపు