పుట:Kinnera, sanputam 2, sanchika 7, july 1950.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశోధించి, కవుల చరిత్రములను కరతలామలకములుగ నొనర్చుకొని నన్నయనాటి దేశ, కాల, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు ప్రతిబింబించున ట్లీ " నారాయణభట్టు " ను చరించిరి. వీరు విమర్శకు లగుటచే చారిత్రక విషయములు కొన్నింటియెడ వీరికు సంతృప్తి కలుగలేదు. ఈ విషయము వీరు వ్రాసిన - " నాకు సాధ్యమయినంతవరకు ఆ కాలపు చరిత్ర సంపాదించితిని. అందులో కృషిచేసిన పలువుర వ్యాసములు చదివితిని. ముఖ్యముగా ఆంధ్రుల చరిత్రయు, రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచికయు నామూలాగ్రముగ పఠించితిని. వానిలో నెన్నియో భ్రమలు కలవు. ఆ భ్రమలు కూడ నా కెక్కినవి. అనంతరమున పరిశోధకు లెన్నియో నూతనాంశములు వెలువరించినారు.