పుట:Kimmurukaifiyatu00unknsher.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిమ్మూరు కైఫీయతు

ఆంధ్రదేశమందు వింధ్యపర్వతమునకు సామీప్యమయిన మహదరణ్యము వ్యాఘ్రాదిమృగములచేతను, నిండియుండగాను కలియుగమునందు కొన్నిదినములు గతమైనతరువాత కిమ్మీరు డనే ----రాజు అరణ్యభూములయందు నివాసముగా యుండి కొన్నినాళ్లకు తనపేరిట ఒక పట్టము నిర్మాణముచేయవలెననే యిచ్చచేతను దాక్షారామ మహాస్థలమునకు 14 క్రోసుల దూరమున పర్వతములకు సామీప్యమందు తనపేరిట కిమ్మూరనే వాడికగా గ్రామనిర్మాణం చేయించినాడు. మన్నెపుప్రాంతములైన గ్రామములు కిమ్మూరుమాగాని, అనగా పరగణాలని వాడుకైయుండెను. ఈ క్రింది గ్రామములు కిమ్మూరుసీమలో చేరినవి. పెద్దాపురసంస్థానమునకు ప్రాచీననామమయిన --- కట్టమూరు, కాట్రావులపల్లె, గుడివాడ, యీగ్రామములు ఆరునూర్లయిరవై (620) సంవత్సరముల క్రిందట పిఠాపురపట్టణమందు శ్రీ కుంతీమాధవస్వామి సన్నిధిని యీదేశమునభిషిక్తుడైన శ్రీవల్లభదేవచక్రవర్తి యేలుబడినాటికి ప్రోలునాడు సీమలో చల్లుతూయుండెడిది. సౌలిమేశ్వరము, కాండ్రకోట, దిగువల్లి, వడ్లమూరు, జగపతిరాయపురం యీగ్రామము