పుట:Kavitvatatvavicharamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము

                                                                                   83

ఆయమ్మ యొక్క జననవృత్తాంతమును వర్ణించుచు, నీ త్రిలోక సుందరి సామాన్యజనులను వేగిరము వేగిరముగ వక్క ముక్కలుగా సృజించు బ్రహ్మచే సృజింపCబడినది గాదనియు, సిష్కారణముగ నా త్రిపురసుందరి స్వయముగ నిదానించి చూచి సర్వసామగ్రులు గూర్చి బాగునకుఁ దెచ్చిన కన్యామణియనియుఁ గవి చెప్పియుండు టంబట్టి, యా వాద మొప్పకోదగినది గాదు.

ప్రాచీనుల మోహ తాపము

నిజము చూడఁబోయినఁ బ్రభావతీ ప్రద్యుమ్నము శైలి నొక్క దానిం దప్ప తక్కిన విషయములలో సామాన్య ప్రబంధముల మీఱి నది గాదు. కథ మిక్కిలి సన్నము. చిత్రరూపములు, దూతికలు మొదలగు మధ్యవర్తులమాటలు, వీనిచే నాకాలమువారికిఁ గామాగ్ని యున్నట్టు Cడి ప్రభవిల్లి మనసులను దేహములను దహింపఁజేయు నంత తైక్ష్యమును బహుత్వరలోఁ గాంచుట సర్వసాధారణ మే మో ! బహుశః వారెల్ల నెండిన కులో ! ఇప్ప డింగ్లీషు ముక్కలు చదువు వారు ' నేరుగాఁ జూచి మాట్లాడిననే కాని యూ దందహ్యమానత మాకుఁ బట్టువడదు' అని యా క్షేపించుటఁ జూడఁగా కాలవైప రీత్యము బోధపడియెడిని. మనది ప్రత్యక్ష మోహము. మన పెద్ద లింతకన్న ను ద్రేకముగలవారగుటంబట్టి వినిన నేచాలును ! గుప్పన మండెడివారు . వకళ్ళమూలమై పరోక్ష మోహమువారికి ప్రధానము. అయిన నాకొక సంశయము. మన పెద్దలు వేద వేదాంత వికా స భాసుర విచిత్ర చరిత్రులే ! రాగరహితులే. శమదమాది సంపత్స మే తులే ! అట్టుండియు నీయొక్క విషమసమయంబున మాత్ర మేల యింత చాంచల్యము వడసిరో తెలియcజాలము గదా ! అవ్యా జాద్భుతములలో నిదియొకటి. నిర్ణేతుక జూయమాన చిత్తవిభ్రమ మును వేదాంతవిచారమును సమ్మేళించి యుండుట యాశ్చర్యము గదా ! ఆశ్చర్యమైనను అప్రకృతమా ? కాదేవెూ ! ఎట్లన, ఇంద్రి యముల నిగ్రహింపవలయు నిగ్రహింపవలయునని జపము చేయు చుండు వారు, ఆ యింద్రియములయందే నిగాయుంతురు గాన, నదియొక విధమైన యున్మాద హేతువు. కాకున్న నందఅకన్న ముందుగ జితేంద్రియులైన మహర్డు లప్సరసలC జూచి చూడక యున్న యేల యువ్విళ్లూరు దురు ! గంతులు వేయుదురు ! మఱియు భరతఖండము క్షీణదశకు వచ్చినది మొదలు గొప్ప గొప్ప ప్రయత్నములు గొంతెమకోరికలైనందుననేమో కాని తుచ్ఛములు