పుట:Kavitvatatvavicharamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమ భాగము 75 యది విడువఁబడఁ గూడని యంత కలయికతో వెలయునది గాదు. ఆపద్య మేదన, ఇందు (డు శుచిముఖిని కొనియాడుచు నాడిన ; "సీ. శబ్దసంస్కార మెచ్చటను జాఱఁగ నీక

                               పదమైత్రి యర్థ నంపదలఁ బొదల
               దలఁ పెల్ల నక్లిష్టతను బ్రదీపితముగాఁ
                            బునరుక్తి దోషంబు పొంతఁబోక
              యా కాంక్షితస్పూర్తి యాచరించుచును శా
                             ఖా చంక్రమ క్రియఁ గడవఁ జనక
              ప్రకృతార్ధభావంబు పాదు కోనదుకుచు
                           నుపపత్తి యెందు నత్యూర్జితముగ

తే. నొకటఁ బూర్వోత్తర విరోధ మొందకుండఁ

             దత్తదవయవవాక్య తాత్పర్య భేద
            ములు మహావాక్య తాత్పర్యమునకు నొనరఁ 
               బలుక నేర్చుటబహుతపః ఫలము గాదె !”                           (ప్రభా. ఆ, 2, ప. 3)

అనునది. రెండు గ్రంథములలోని యీ రెండు పద్యములం బోల్చి చూచితి మేని నీ రెండవకృతి రచించు లోపలఁ గవి కొంతమట్టునకు శైలింగూర్చిన యభిప్రాయము మార్చినాఁడనియు c జెప్పట కవ కాశ మయ్యెడి. కళాపూర్ణోదయ పద్యముంబట్టిచూచినఁ గవి యు లంకార శాస్త్రములయెడ బహు భక్తిగలవాఁడనియు, నర్థాలంకారములు మాత్రము గాక శబ్దాలంకారములును అవశ్యాను ఫ్టేయములని భావించినట్లును, గానం బ డియో డి . ప్రభావతీ ప్రద్యుమ్న పద్యములో నలంకారశాస్త్రముం గూర్చిన విచారచిహ్న లెవ్వియును లేవు. శబ్దాలంకారములంగూర్చి కవి యువ్విళ్ళూరకపోవుటయే కాదు, అర్థాలంకారములనైన ధ్యానించినట్లు పోకడగానము. భావములు, అర్ధములు, తాత్పర్యములు, అవయ వసంయోగము మొదలగు తలఁపులతోఁ జేరిన లక్షణములమీఁద నే కాగ్రమగు దృష్టిని నిలుపుట మేలని యెంచెనేమో ! ప్రభావతీ ప్రద్యుమ్నములో చిత్రకవిత్వ మత్యల్పము. ఇంచుమించు శూన్యమును, కళాపూర్ణోదయమున నంత యెక్కువ గాకున్నను దానియందుకన్న నధికమ. ప్రబంధ ములయందుంబ లె నమితముగాదు. రసనాశ మొనరించునంత విపరీతపు వాక్సరణి యీ కవి యెంతదపసుచేసినను సాధ్యమగు వరముగాదు. ఏలన, భావ గంభీరుఁడు గాన. ప్రభావతీ ప్రద్యుమ్నము విషయమునఁ బ్రబంధసంబంధి శైలిలోగాదు. కళాపూర్ణోదయము